రామగుండం పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 27మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ వారికి 58,000 జరిమానా విధించారు. రెండవసారి పట్టుబడిన కొత్తకొండ శంకర్ కు 03 రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.
Godavarikhani: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష
సంబంధిత వార్తలు | RELATED ARTICLES