మటన్ వండలేదని మర్డర్ (Murder) చేసాడు ఓ కసాయి భర్త. తన భార్యను మటన్ కన్నా దారుణంగా మర్డర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా, సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామశివారు మంజాతండాలో చోటుచేసుకుంది.
మంజా తండాలో నివాసం ఉంటున్న మాలోత్ కళావతి, బాలు దంపతులు. వీరిద్దరి మధ్య మటన్ చిచ్చుపెట్టింది. మాసంవడ్డమని భార్య కళావతికి భర్త బాలు చెప్పారు. అయితే ఎందుకో కళావతి మటన్ వండలేదు. దీంతో కోపోద్రిక్తుడైన బాలు రాత్రి ఎవ్వరు లేని సమయంలో గొడవపడి కొట్టి చంపినట్లు మృతురాలి తల్లి ఆరోపిస్తుంది.
ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి పోలీసులకు చేరింది. సంఘటన స్థలానికి చేరుకున్న వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీరి మధ్య కేవలం మటన్ గురించే గొడవ అయిందా ఇంకా ఏవైనా సమస్యలతో ఈ ఘటనకు పాల్పడ్డడా..? అనే విషయాలు తేల్చాల్సి ఉంది.