ఉన్న నాలుగు వెంట్రుకలు ఊడకుండా ఉంటే చాలు అదే పదివేలు. కానీ ఓ వ్యక్తి ఏకంగా బట్టతల(Bald)కే వెంట్రుకలు వచ్చేలా చేస్తానని నమ్మబలికి గుండు కొట్టి తైలం రాసి పంపాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూసేయండి.
బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. అది చూసిన చాలా మంది తను చెప్పిన అడ్రస్ కి వచ్చేశారు. ఒకరు కాదు ఇద్దరు సూమరు పదుల సంఖ్యలో క్యూ కట్టారు.
హైదరాబాద్ పాతబస్తీలోని తన ఫ్రెండ్ షాపుకు రావాలని చెప్పాడు. వకీల్ ఒక్కొక్కరి దగ్గర రూ. 100 తీసుకుని గుండు కొట్టి, కెమికల్స్ రాసి పంపించాడు. గుండు ఆరిపోకుండా ఉంచాలని షరతు కూడా పెట్టి వెళ్లిపోయాడు.
కొంతమందికి రియాక్షన్ అయి బొబ్బలు వచ్చాయి. బట్టతల ఏమో కాని ఉన్న వెంట్రుకలూ పోయాయని వందలాది మంది యువకులు లబోదిబోమంటున్నారు.