నెలవారీ ఆన్‌లైన్ నేర సమీక్ష సమావేశంలో భాగంగా పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఏస్పీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా పెండింగ్ కేసులపై పురోగతి సాధించిన స్టాఫ్ ను డీజీపీ ప్రశంసించారు.
పారదర్శకతను విస్తరింపజేయడం లక్ష్యంగా అమలవుతున్న ఫంక్షనల్ వర్టికల్స్ అమలు తీరును సమీక్షించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ సిబ్బందిని ప్రతినెల నిర్వహించే మోగా రివార్డ్ మేళాలో ప్రోత్సహిస్తూ రివార్డ్స్ అందజేయాలని డీజీపీ సూచించారు. క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , పోక్సో , ఎస్సీ ఎస్టీ, సైబర్ నేరాలు, క్రైమ్ తదితర కేసుల్లో పోలీస్ అధికారుల నిరంతర సమీక్షలు, పర్యవేక్షణతో నిందితులకు శిక్ష పడేలా చేస్తుందని స్పష్టం చేశారు.
నేర పరిశోధన,కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్ట్, చార్జ్ షీట్ సమయంలో మరింత నాణ్యత ప్రమాణాలు పాటించడం, నేర నిరూపణలో కీలక పాత్ర పోషించే దర్యాప్తు అధికారికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండేలా మార్గనిర్దేశం చేశారు. HRMS, సైబర్ నేరాలపై పోలీస్ అధికారులు తరచూ రివ్యూ నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ వివరించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ,AR అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు ప్రసన్న కుమార్, రామోజీ రమేష్, గణేష్, భస్వారెడ్డి, వెంకటస్వామి, , రహెమాన్, రవి, వేంకటేశ్వర్లు, AO అక్తరూనీసా బేగం పాల్గొన్నారు.