హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు అక్రమ గేమింగ్ హౌస్ (Gaming House) లను నిర్వహిస్తున్న రెండు స్థావరాలపై బుధవారం అర్ధరాత్రి దాడి చేశారు. ఈ రైడ్స్ లో మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ప్లే కార్డులు, రూ.1,33,990 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారిని విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్ లకు తరలించారు.
Also Read : కుల గణనపై డీకే అరుణ సూటి ప్రశ్నలు
హైదరాబాద్ మధురానగర్ కి చెందిన ఎన్నపూసల మల్లారెడ్డి (35) ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద గేమింగ్ హౌస్ (Gaming House) నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. జూబ్లీహిల్స్ PS వద్ద గేమింగ్ హౌస్ నిర్వహిస్తున్న యూసుఫ్‌గూడకి చెందిన మహ్మద్ నయీముద్దీన్(63) ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.