యువకులు ఫ్యాక్షన్ రక్కసిని వీడి విద్యను దరి చేర్చుకోవాలని సెబ్ ఏఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ పిలుపునిచ్చారు. దేవనకొండ మండల పరిధిలోని కప్పట్రాళ్ల గ్రామంలో కృష్ణకాంత్ పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతంలో కప్పట్రాళ్ల గ్రామంలో అనేక మంది ఫ్యాక్షన్ కు బలైపోయారని గుర్తు చేశారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించుకొని ఉన్నత స్థాయికి వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా నడవాలని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ రూరల్ పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Kappatralla: ఫ్యాక్షన్ రక్కసిని వీడి విద్యను దరి చేర్చుకోండి..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES