మండల పరిధిలోని భాగ్యనగర్ తండ గ్రామంలో అచ్చమ్మ ఇంటి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమీపంలో భూమిపై వాలి ఉండడాన్ని గమనించిన ప్రజలు పలుమార్లు అధికారుల దృష్ట్యా తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరితోని అదే గ్రామానికి చెందిన భగవాన్ ఎద్దు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎద్దు ఖరీదు. సుమారు రూ 60 వేలు చేస్తుందని స్థానికుల అంచనా. విద్యుత్ శాఖ అధికారులు ప్రభుత్వము రైతును ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Karepalli: విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి ఎద్దు బలి
రైతును ఆదుకునేదెవరు?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES