Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుKautalam: కర్నాటక మద్యం స్వాధీనం

Kautalam: కర్నాటక మద్యం స్వాధీనం

భారీ స్థాయిలో కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు కౌతాళం పోలీసులు. స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోసిగి సీఐ ఎరిషావలి, కౌతాళం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ.. తమకు అందిన సమచారం మేరకు సిబ్బంది సహాయంతో ఉదయం సుమారు 6.30 గంటలకు వల్లూర్ గ్రామము శివారున గల తుంగభద్ర నది ఒడ్డున కోసిగి గ్రామానికి చెందిన తోవి వినోద్ కుమార్, కుప్పుగల్ శీను, నడిగేరి ఊరుకుంద ముగ్గురు కర్ణాటక రాష్ట్రంలోని మాన్విలోని వైన్ షాప్ ల నుండి కర్ణాటక మద్యాన్ని తక్కువ రేటుకు కొనుక్కోని నది ఆవలి వైపు నుండి ఒక తెప్ప సహాయంతో నది ఈ వైపునకు తెచ్చుకొని రెండు మోటార్ సైకళ్ళ పై వేసుకొని చుట్టుపక్కల గ్రామాల వారికి హోల్ షేల్ గా అమ్ముకుందామని పోతుండగా పై ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న ఈ బాక్స్ లు ఒరిజినల్ చాయిస్ deluxe విస్కీ కర్ణాటక టెట్రా పాకెట్లు ఆడి 90 ఎంఎల్ (total 6,144 packets) లను, రెండు మోటార్ సైకళ్ళను మరియు ఒక Real me C12 CELL PHONE మరియు ఒక తెప్పును కేసు తదుపరి చర్య నిమిత్తం స్వాదీన పరుచుకోవడమైనది కావున ఎవరైనా కర్ణాటక మధ్యం అమ్మినా, తరలించినా, కల్గి ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకొన బడును.. అని వారు తెలిపారు… మొత్తం 64 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు… మార్కెట్ విలువ ప్రకారం సుమారు 6 లక్షల విలువ ఉంటుందని వారు తెలిపారు…. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News