Thursday, April 18, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: గుడుంబా స్థావరాలపై దాడులు

Garla: గుడుంబా స్థావరాలపై దాడులు

300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

గార్ల మండల పరిధిలోని శేరిపురం గ్రామంలో గుడుంబా స్థావరాలపై బయ్యారం సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినట్లు గార్ల ఎస్సై జీనత్ కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశామని అక్రమంగా నాటుసారా తయారుచేసిన సక్కీ కాలు భద్రాజి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నాటుసారా విక్రయించినా తయారు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్ మంగీలాల్ శ్రీనివాస్ రాము బద్రు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News