Drunk Man Kills Mother: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భార్యను కొడుతున్న కొడుకును అడ్డుకోబోయినందుకు, అతను తన తల్లిని గొంతు నులిమి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
మద్యం మత్తులో ఇంటికి వచ్చి..
బాఘేరా కలన్ గ్రామానికి చెందిన రాంసూరత్ బింద్ అనే వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే తన భార్య సునీతా దేవిని కొట్టడం ప్రారంభించాడు. అంతేకాకుండా, కుటుంబ సభ్యులను దుర్భాషలాడడం, తిట్టడం మొదలుపెట్టాడు అని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నితీష్ సింగ్ తెలిపారు.
ALSO READ: Pocso Case: లడ్డూ ఆశచూపి.. పసిమొగ్గపై పైశాచికం – మద్యం మత్తులో ఇద్దరు కామాంధుల ఘాతుకం!
రాంసూరత్ తల్లి, 65 ఏళ్ల చమేలియా దేవి, కొడుకు చర్యను తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆవేశానికి లోనైన రాంసూరత్, తన తల్లిని కొట్టడం, గొంతు నులమడం మొదలుపెట్టాడు. దీంతో చమేలియా దేవి స్పృహ తప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ALSO READ: BIG Breaking: వికారాబాద్‌లో రక్తపుటేరు.. భార్య, బిడ్డను, వదినను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
తమ్ముడి ఫిర్యాదుతో అరెస్ట్
చమేలియా దేవి చిన్న కొడుకు రామ్మూరత్ బింద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు జిగ్నా పోలీస్ స్టేషన్‌లో రాంసూరత్ బింద్‌పై కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చమేలియా దేవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవలో జోక్యం చేసుకున్నందుకు తల్లి దారుణంగా హత్యకు గురవడం ఆ గ్రామంలో విషాదం నింపింది.
ALSO READ: Road Accident: జాతీయ రహదారిపై మరో మృత్యు ఘోష.. రాజస్థాన్‌లో టెంపో అదుపు తప్పి 18 మంది మృతి


