Wednesday, July 3, 2024
Homeనేరాలు-ఘోరాలుManchiryala: రోగులను బలిగొంటున్న ప్రైవేట్ అంబులెన్స్

Manchiryala: రోగులను బలిగొంటున్న ప్రైవేట్ అంబులెన్స్

వందల్లో అంబులెన్స్ లు.. వేలల్లో ఆర్ఎంపీలు

అంబులెన్స్, ఆర్ఎంపీ వ్యవస్థతోనే గత కొంతకాలం నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో దోచుకోవడం మొదలైంది. ఆర్ఎంపీ, అంబులెన్స్ చోదకుల సహకారంతో వచ్చారని తెలిస్తే చాలు బాధితుడిని ఇక బాదుడే. వారికి ఇచ్చే కమీషన్ కోసం వీరి జేబులు ఖాళీ అయ్యేలా చేస్తున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు టీఎస్ఎంసీ చర్యలు చేపట్టింది. దీనికి పోలీసు, రవాణా శాఖ తోడ్పాటు అందిస్తుండటంతో మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది.

- Advertisement -

వందల్లో అంబులెన్స్ లు.. వేలల్లో ఆర్ఎంపీలు

జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు అత్యవసర వాహనాలు వందల్లో ఉంటే ఆర్ఎంపీ, పీఎంపీలు వేలల్లో ఉన్నారు. వీరు బాధితుడిని ఏ ఆసుపత్రికి రెఫర్ చేసినా 40- 45శాతం కమీషన్ ఆయా వ్యక్తుల జేబుల్లో పడాల్సిందే. బాధితుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవడం, చోదకులకు నచ్చిన ఆసుపత్రి (కనీస సదుపాయాలులేని)కి తరలిస్తూ బాధితులు ప్రాణాలు గాలికి వదిలేస్తూ లబ్ధి పొందుతున్నారు. అత్యాశకు పోయి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీరి నిర్లక్ష్యంతోనే నెల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీనికి కారణం అంబులెన్స్ చోదకులే అని తేలడంతో పాటు ఇటీవల ఒకరిని అరెస్టు చేశారు.

ఆసుపత్రులను కట్టడి చేస్తే మేలు..

అంబులెన్స్ చోదకులను ప్రోత్సహిస్తున్న కొన్ని ప్రైవేటు ఆసుపత్రులను కట్టడి చేస్తే చాలావరకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఆయా ఆసుపత్రులపై టీఎస్ఎంసీ దాడులు ప్రారంభించింది. రెండు రోజుల కిందట మూడు ఆసుపత్రులను తనిఖీ చేసింది. ఇంకా పదికి పైగా ఆసుపత్రులను తనిఖీ చేయాల్సి ఉందని ఆయా కమిటీ సభ్యులు తెలిపారు. తనిఖీ చేసిన మూడింటిలోనూ సౌకర్యాలు, వైద్యులు లేరని తేలింది. త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News