మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో మేకను దొగతనం చేశాడని ఓ వ్యక్తిని మేకల కొట్టంలోనే కట్టేసి కొట్టిన వ్యక్తులపై విచారణ జరిపి కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి ఏసీపీ పి.సదయ్య. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ప్రాంతానికి చెందిన నిట్టూరి సరిత పోలీస్ స్టేషన్లో ఇచ్చిన పిర్యాదు ఆమే అక్క కొడుకు కిరణ్ (30) ఎస్సి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మేకల దొంగతనం చేసాడనే నెపంతో అదే వాడకు చెందిన రాములు వాళ్ళ కొడుకు శ్రీనివాస్ అతని భార్య స్వరూప, వల్ల దగ్గర పని చేసే నరేష్ లు కిరణ్ ను వారి మేకల కొట్టం దగ్గరికి తీసుకు వెళ్లి పైకి వేలాడదీసి, కట్టేసి కొట్టి, మేక దొంగతనం చేసినందుకు డబ్బులు కట్టాలని వేధిస్తుండగా.. అదే వాడకు చెందిన శ్రావణ్ మేకకు డబ్బులు తాను కడుతాను అని వారికి నచ్చచెప్పి, కిరణ్ ను ఇంటికి తీసుకువచ్చాడు. శుక్రవారం సాయంత్రం నుండి మా అక్క కొడుకు కిరణ్ కనిపించడం లేదు అని మందమర్రి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. ఆదివారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ పి. సదయ్య నిందుతుల వివరాలను వెల్లడించారు… సెప్టెంబర్ 2వ తేదీ రోజున మందమర్రి, యాపాల్ గ్రామానికి చెందిన నిట్టూరి సరిత మందమర్రి పోలీస్ స్టేషన్ కి వచ్చి మేకలు దొంగతనం చేశారని తన అక్క కొడుకు కిరణ్ ను మేకల కొట్టంలో తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ లతో కలిసి తీవ్రంగా హింసించారని ఫిర్యాదు చేయగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ సదయ్య మందమర్రి యాపాల్ గ్రామాన్ని సందర్శించి గ్రామం లోని చుట్టూ స్థానిక ప్రజలతో మాట్లాడి సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి విచారణలో నేరం నిరూపణ అయినందున నిందితులు కొమురాజు రాములు(57), కొమురాజు స్వరూప(54) రాములు భార్య,
కొమురాజు శ్రీనివాస్(37) రాములు కొడుకు ఉన్నారు. నిందితులపై క్రైం నెం.165/23 u/sec.342, 307 r/w 34 IPC & sec.3(2)(v) SC/ST (POA) Act, 1989 చట్టం క్రింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. విచారణ అనంతరం, నిందితులు రాములు, శ్రీనివాస్, రాములు బార్య స్వరూప లను నిన్న రాత్రి అరెస్ట్ చేసి, కోర్ట్ లో ప్రవేశపెట్టగా మేజిస్ట్రేట్ గారు రిమాండ్ కి ఆదిలాబాద్ జైలు కి పంపడం జరిగింది. ఈసందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ… సీపీ రామగుండము రెమ రాజేశ్వరి ఐపీస్,. డిఐజీ,. ఆదేశాల మేరకు దళితులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల 30 వ తేదీన ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలలో “సివిల్ రైట్స్ డే” నిర్వహించి ప్రజలకు కుల వివక్ష, చట్టలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎదుటివారి హక్కులకు ఎలాంటి భంగం కల్గించడం, కుల వివక్ష చూపడం, దాడులకు పాల్పడడం అనేది చట్టారీత్యా నేరం అని దానికి ఎవరైనా పాల్పడిన, వారికి సహకరించిన, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రోత్సహించే వారిపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసు నమోదు చేసిన 24 గంటలలోనే నిందితులను పట్టుకున్న మందమర్రి పోలీసులను సీపీ అభినందిచారు.
Manchiryala: దళిత వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తులపై ఎస్సి ఎస్టీ కేసు నమోదు
కేసు నమోదైన 24 గం.ల్లోనే నిందితులను పట్టివేత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES