Saturday, September 21, 2024
Homeనేరాలు-ఘోరాలుJanagam: ఎమ్మెల్యేకి భారీ షాక్ ఇచ్చిన కుమార్తె

Janagam: ఎమ్మెల్యేకి భారీ షాక్ ఇచ్చిన కుమార్తె

జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన చేర్యాల పెద్ద చెరువు మత్తడి, పశువుల అంగడి స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తానని ఎమ్మెల్యే కుమార్తె తుల్జా భవాని రెడ్డి తెలిపారు. పెద్ద చెరువు మత్తడి 21 గుంటల స్థలానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వేసిన ప్రహరీ గోడను భవాని రెడ్డి తొలగించారు. ప్రజల ఆస్తిని తన తండ్రి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి తప్పిదం చేశారని, తన తండ్రి రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ చూపించి ఇది కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి కోర్టు ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు. తన తండ్రి తప్పు చేశాడని ఇలాంటి పని చేసి ఉండాల్సింది కాదని వెయ్యి కోట్ల ఆస్తి ఉండి, ప్రతీ నెలా కోటిన్నర రెంట్ వస్తుండడం 70 ఏళ్ల వయస్సులో 2 సార్లు ఎమ్మెల్యే అయి ఉండి ఇలా చేయడం సరైంది కాదని, తప్పు జరిగిందని చేర్యాల ప్రజలకు క్షమాపణ చెపుతున్నా అంటూ చేర్యాల మున్సిపాలిటీకి కోర్టు ద్వారా జిల్లా కలెక్టర్ కు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పడంతో అఖిలపక్షం, మత్తడి పరిరక్షణ సమితి, జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కుమార్తె తుల్జా భవాని రెడ్డికి అభినందనలు తెలుపుతూ, చేర్యాల పాత బస్టాండ్ వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.

- Advertisement -

నాపై ప్రతిపక్ష నాయకులు కుట్ర చేస్తున్నారు- ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

నాకు నా కూతురుకు కొన్ని తగాదాలు ఉన్నది వాస్తవం దీన్ని పావుల వాడుకుని కొంతమంది ప్రతిపక్ష నాయకులు పనికట్టుకొని కుటుంబంలో చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నారు. నేను ఎలాంటి ప్రభుత్వ భూమి కబ్జా చేయలేదని చెరువు మత్తడి భూమి రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూమిగా ఉందని ఇట్టి భూమి వివాదం కోర్టులో ఉండడంతో పట్టా భూమిగా రెవెన్యూ అధికారులు రికార్డులు కోర్టుకు సమర్పించినట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. రాజకీయంగా ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాని కానీ కుటుంబంలో చిచ్చు పెట్టి రాజకీయం చేయడం సబబు కాదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News