నందికొట్కూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో పారిశుద్ధ్యం పనులు నిర్వహించడంలో కొందరు పంచాయతీ అధికారులు పాలకవర్గం అలసత్వం ప్రదర్శించడం వల్ల చెత్త చెదారంతో గ్రామాలలో వ్యర్ధ పదార్థాలతోటి కంపు కొడుతున్నాయి. ప్లాస్టిక్ చెత్త ప్రధాన రోడ్లపై గత కొన్ని రోజులుగా కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి … అందులో కొల్లబ్బాపురం గ్రామపంచాయతీ అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో స్వచ్ఛత కోసం జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అధికారుల నిర్లక్ష్యంతో ఆ కార్యక్రమం పేరుకే పరిమితమైనదని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈ గ్రామంలో పారిశుద్ధ్య పనులపై స్థానిక అధికారుల నిర్లక్ష్యం.. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
పట్టించుకోని పంచాయతీ అధికారులు:
నందికొట్కూర్ మండల పరిధిలోని కొన్ని గ్రామాలలో పంచాయితీ అధికారి పర్యవేక్షణ లోపంతో మండల పరిధిలోని కోళ్ల బావాపురము గ్రామములో పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనబడుతుందని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం:-
డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణ లోపం, ప్రధాన రహదారుల, ఇండ్ల మధ్య చెత్త చెదారంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో అస్తవ్యస్తంగా వ్యవస్థ అద్వానంగా కనబడుతోంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చెత్త సేకరణలలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం:
గ్రామంలో ప్రతినిత్యం తడి చెత్త, పొడి చెత్త సేకరించి దానిని కంపోస్ట్ ఎరువుగా మార్చాల్సి ఉన్నప్పటికీ చెత్త సేకరణలో పంచాయతీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనే ఆరోపణలు వినబడుతున్నాయి.. ఆయా గ్రామాలలో చెత్త సేకరణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న వైనం స్పష్టంగా కనబడుతుంది. పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా చేపట్టి అపరిశుభ్రం ప్రాంతాలను శుభ్రపరిచి బ్లీచింగ్ చల్లించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు దారితీసింది. గ్రామంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆలస్యం అవుతుంది అన్న అధికారుల వివరణ వారి పనితనాన్ని తెలుపుతుంది.
విపరీతమైన దోమల బెడద..
కొల్లబావు పురం గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు దర్శనమిస్తూన్న తీరు ప్రజలలో ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుత వర్షాకాలం సీజన్ లో అపరిశుభ్రత వల్ల అనేక రకాల వ్యాధులు సంభవించే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అపరిశుభ్రత ప్రాంతమంతా అంతా దుర్గంధం తో దుర్వాసన రేకెత్తిస్తున్నాయి. సంబంధిత పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టనట్లఅయితే విపరీతమైన దోమల పెరుగుదలతో ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు కోళ్లభవాపురం గ్రామము పై ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు..
గోపాల్ : గ్రామస్థుడు
గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నాయని స్థానికుడు గోపాల్ మండిపడ్డాడు. గ్రామంలో విదల వెంట ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయన్నారు. ప్రస్తుతం వర్షాకాలం.. అపరిశుభ్రమైన వాతావరణం ఉండడం వల్ల మురుగునీరు కాలువలు రోడ్లపై పారుతుండడం , దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదంటూ వారు వాపోయారు.