Friday, July 5, 2024
Homeనేరాలు-ఘోరాలుNandyala: రైతుల ఆత్మహత్యా యత్నం

Nandyala: రైతుల ఆత్మహత్యా యత్నం

నంద్యాల పట్టణ శివారు ప్రాంతాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్తితి.. తినీ తినక రూపాయి రూపాయి పోగేసి తాత ముత్తాతల నాడు వారసత్వంగా వచ్చిన ఎకరం అర ఎకరం పొలాలు సాగు చేసుకుంటూ జీవనం గడిపే నంద్యాల పరిసర ప్రాంత రైతులకు ఇప్పుడు కంటిమీద కునుకు ఉండటంలేదు..ఎప్పుడు రైల్వే జోన్ వస్తుందో ఎప్పుడు పారిశ్రామిక జోన్ వస్తుందో ఎప్పుడు ఏ హై వే పేరుతో పొలాలు లాగేసు కుంటారో అని రైతులు ఆందోళన చెందుతున్నారు..ఇటీవల పారిశ్రామిక జోన్ అంటూ వెయ్యి ఎకరాలు ఆ జోన్ లోకి వెళ్ళయంటు వార్తలు రావడంతో నంద్యాల రూరల్ మండల రైతులు ఆందోళన బాట పట్టారు..తాత్కాలికంగా ఈ సమస్య పక్కన పడింది అనే లోపే 167 కే జాతీయ రహదారి రైతుల పాలిట శాపం గా మారింది..ఈ రహదారి అలైన్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేసినప్పటికీ స్థానికంగా ప్రజా ప్రతినిధులు కనుసన్న్లోనే జరిగిందని ఇక్కడి రైతులు ఆరోపిస్తున్నారు..నంద్యాల మండల పరిధిలోని పాండురంగ పురం,కానల గ్రామాల మధ్య అధికారపార్టీ ప్రజాప్రతినిధులు చక్రం తిప్పి అలైన్మెంట్ వారి రియల్ ఎస్టేట్ వెంచర్లకు మేలు జరిగేలా మార్చుకున్నారు అని రైతులు ఆరోపిస్తున్నారు..167 కే రహదారికి తాము వ్యతిరేకం కాదని రోడ్డు వెళ్ళే మార్గం వెంబడి 25 అడుగుల ప్రభుత్వ పొలం రాస్తా కలుపుకుని రోడ్డు నిర్మిస్తే ఎక్కవ శాతం రైతులకు నష్టం జరగదని అదేవిధంగా ఈ రాస్తా నిడివి మేర ప్రభుత్వానికి నష్ట పరీహారం చెల్లించే పని లేకపోవడం తో ప్రజాధనం వృధాకాదన్నారు…ఈ విషయం విస్మరించి కీలక ప్రజా ప్రతినిధుల స్వలాభం కోసం మాత్రమే ఈ ఆల్లైన్ మెంట్ వేశారని రైతులు ఆరోపిస్తున్నారు.. తమతో సంప్రదించకుండా తమ అభిప్రాయాలు తీసుకోకుండా ఏక పక్షంగా సర్వే రాళ్ళు వెస్తుండటం తో తాము అడ్డుకున్నమన్నరు..జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ నేషనల్ హైవే అధికారులకు ఎన్ని విన్నపాలు చేసినా ఫలితం లేక పోగా తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు ఎన్ హెచ్ అధికారులు వచ్చి కొలతలు వేస్తున్నారని రైతులు వాపోయారు..తహశీల్దార్ శ్రీనివాసులు రెవెన్యూ సిబ్బంది వెనక్కి వెళ్ళాలని లేకుంటే తాము ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు..ఈ సందర్భంగా రైతులకు రెవెన్యూ అధికారులకు వాక్ వివాదం జరిగింది…ఎట్టకేలకు రైతుల ప్రతి ఘటనతో అధికారులు వెను తిరిగి .
కొద్దిసేపటికే పోలీసులు రంగ ప్రవేశం చెయ్యడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుందిఎంపి .ఈ ప్రాంత రైతుల తో సమావేశం నిర్వహించి తమ సమస్యలను అధికారులువినాలని భూముల లాగేసుకుని అమరావతి రైతుల మాదిరి మారిస్తే తమ పరిస్తితి ఎంట నిరైతులు ప్రశ్నిస్తున్నారు…తమ సమస్య తీర్చకుండా మొండిగా వ్యవహరిస్తే తమకు ఆత్మ హత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న నంద్యాల ఎమ్మార్వో శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతుల సద్దుమణిగారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News