Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుOrissa: భార్య మృతదేహం భుజంపై మోసుకెళ్లిన భర్త

Orissa: భార్య మృతదేహం భుజంపై మోసుకెళ్లిన భర్త

మరణించిన తన భార్య మృతదేహాన్ని కిలోమీటర్లకొద్దీ మోసుకెళ్లిన గిరిజనుడి ఉదంతం షాకింగ్ గా మారింది. విజయనగరం గిరిజన ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్దామంటే అందుకు ఆటో డ్రైవర్ అంగీకరించలేదు. వేరే వాహనం కోసం తనవద్ద డబ్బు లేక 33 ఏళ్ల గిరిజనుడు తన భార్య శవాన్ని భుజంపైన వేసుకుని హైవే వెంట నడవాల్సిన దుస్థితి తలెత్తింది. ఇలా వెళ్తున్న గిరిజనుడి వ్యథను కొందరు స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి అతనికి సాయం చేశారు. బాధితుడు ఒడిస్సా కోరాపుట్ కు చెందినవాడు. ఆసుపత్రి నుంచి ఒరిస్సాలో తాను ఉంటున్న ప్రాంతానికి 130 కిలోమీటర్లు ప్రయాణిస్తేకానీ చేరుకోలేడు. దీంతో తప్పని పరిస్థితుల్లో అతడు భార్య మృతదేహాన్ని మోసుకెళ్లక తప్పలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News