Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: ప్రజాదర్బార్ లో SI, తహశిల్దారుపై ఫిర్యాదు

Karimnagar: ప్రజాదర్బార్ లో SI, తహశిల్దారుపై ఫిర్యాదు

అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆమాయకులపై విరుచుకుపడున్నట్టు ఫిర్యాదు

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి తాహసిల్దారుగా గతంలో పనిచేసిన చిల్ల శ్రీనివాస్, ఎస్సైగా పని చేసిన ఎల్లా గౌడ్ పై రేకుర్తికి చెందిన దుర్గం మనోహర్ ప్రజాదర్బార్లో ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దుర్గం మనోహర్ మాట్లాడుతూ…తన తండ్రి దుర్గం మల్లయ్య తల్లి శాంతమ్మ కష్టపడి కొత్తపల్లి హవేలి గ్రామంలోని పట్టా భూమి సర్వే నంబర్ 432 పూర్తి విస్తీర్ణం రెండు ఎకరాల 16 గుంటలు గత 40 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినట్లు చెప్పారు. అందులోనుండి తన తండ్రి బ్రతికున్నప్పుడు రాచకొండ దేవదాసు కి 165 గజాలు, బండ కిషన్ రెడ్డికి 4 గుంటల 25 గజాలు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. బండ కిషన్ రెడ్డికి కొత్తపల్లి తాహసిల్దార్ చిల్ల శ్రీనివాస్ ఖాతా నెంబర్ 96 జారీ చేసి విస్తీర్ణము 4.25 గజాలు మోటేషన్ చేసినట్లు చెప్పారు. తన తండ్రి గుండెపోటుతో తేది 13-08-2020 రోజున మృతి చెందడంతో తన తల్లి మీనా పేరు మీద వీరా సత్ చేసినట్లు చెప్పారు. తనకు వారసత్వంగా రావలసిన భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ధరణి వెబ్ సైట్ లో రుసుములన్ని చెల్లించి స్లాట్ డేట్ ప్రకారం కొత్తపల్లి తహసిల్దార్ దగ్గరికి వెళితే ఈ సర్వే నంబర్ 432 ప్రభుత్వ భూమి నేను రిజిస్ట్రేషన్ చేయను అంటూ కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నట్టు బాధితుడు ఆరోపిస్తున్నాడు.

- Advertisement -

రెండోసారి స్లాట్ బుక్ చేసుకుంటే కలెక్టర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అని రిజిస్ట్రేషన్ చేయకుండా పంపించడంతో 500 రూపాయల ఫైన్ తో స్లాట్ బుక్ చేసుకొని తేదీ 24-09-2022 రోజున తన తల్లితో పాటు ఇద్దరు సాక్షులను తీసుకుని వెళ్లి తాహసిల్దార్ చిల్ల శ్రీనివాస్ కు కలిస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, అసభ్య పదజాలంతో దూషించాడని అన్నారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ పోచయ్య వచ్చి స్టేషన్కు దౌర్జన్యంగా తీసుకువెళ్లారన్నారు. పోలీస్ స్టేషన్ లో ఎస్సై ఎల్లా గౌడ్ వచ్చి మీరు తాసిల్దార్ ఆఫీసుకు రిజిస్ట్రేషన్ చెయ్యను అన్న తర్వాత కూడా 500 రూపాయల ఫైన్ తో ఎందుకు స్లాట్ బుక్ చేసినావు అంటూ, నీ అంతు చూస్తా అని తనని అసభ్య పదజాలాలతో బెదిరించాడ.. నీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, పీడీ యాక్ట్ నమోదు చేస్తా, నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ తన తల్లిని తనను రెండు గంటలు పోలీస్ స్టేషన్లో నిర్బంధించినట్లు చెప్పారు.

తమ విధులను దుర్వినియోగపరుస్తూ సామాన్య ప్రజల పట్ల ఇష్టానుసారం వ్యవహరించిన తహసిల్దార్ చిల్ల శ్రీనివాస్ ఎస్సై ఎల్లా గౌడ్ పై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News