Saturday, September 21, 2024
Homeనేరాలు-ఘోరాలుRamagundam: 72 వరుస దొంగతనాలు చేసిన దొంగ అరెస్ట్

Ramagundam: 72 వరుస దొంగతనాలు చేసిన దొంగ అరెస్ట్

రామగుండం పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలోవరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు చేసి వివరాలను రామగుండం పోలీస్ కమిషనర్, రెమా రాజేశ్వరి వెల్లడించారు. మంచిర్యాల జిల్లా, సీసీసీ నస్పూర్ లోని సిర్కే కాలనీకి చెందిన రాజవరపు వెంకటేష్ ను అరెస్ట్ చేసి విచారించిగా నిందితుడు, నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు7, లక్సెట్టిపేట 6, చెన్నూరు 7, మందమర్రి 11, రామకృష్ణాపూర్ 17, కాసిపేట 2, శ్రీరాంపూర్ 1, మంచిర్యాల 5, గోదావరిఖని వన్ టౌన్ 14, భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దొంగతనాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

పోలీసుల సమిష్టి ప్రయత్నల వలన నిందితుడు దొరికాడని, మొత్తం 72 కేసులలో దొంగిలించిన సొత్తు 2.89కిలోల బంగారం , 4.07 కిలోల వెండి , నగదు రూ .19 లక్షలు వాటి మొత్తం విలువ కోటి 20 లక్షలు దొంగిలించినట్టు తెలిపారు.

ఇప్పటి వరకు నిందితుని వద్ద నుండి 4బైకులు, ఒక్క కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితున్ని పట్టుకోవడం, కేసుల గుర్తింపులో నేర పరిశోదనలో సహకరించి చాకచక్యంగా వ్యవహరించిన మంచిర్యాల డిసిపి సుదీర్ కేకన్ రామనాధ్, మంచిర్యాల ఎసిపి బి.తిరుపతి రెడ్డి, మంచిర్యాల రూరల్ సిఐటి సంజీవ్, సీసీసీ నస్పూర్ ఎస్.ఐ, బి. రవికుమార్, టి. ఉదయ్ కిరణ్ హాజీపూర్ ఎస్సై, ఎఎస్ఐ టి. జితేందర్ సింగ్, పీసీలు చి. తిరుపతి, బి. శ్రీనివాస్, బి. రవి లను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News