Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుRamaympet: విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇన్చార్జి సైకో వార్డెన్ స్వామి

Ramaympet: విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇన్చార్జి సైకో వార్డెన్ స్వామి

అమ్మాయిలను వేధిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారం బాలుర వసతి గృహానికి ఇన్చార్జి వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న స్వామి రామాయంపేట వార్డెన్ విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థులు అమ్మాయిలను వేధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా మెదక్ జిల్లా ప్రతినిధి వెళ్లి వివరణ అడుగగా దురుసుగా ప్రవర్తించిన వైనం నెలకొంది. మీడియాకు వచ్చే అధికారం లేదని తన వద్ద జీవో ఉందని తాను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంతే కాకుండా తాను వసతి గృహంలో ఉద్యోగం చేయనని మీడియా ప్రతినిధి వైన నువ్వే చేయాలని వసతి గృహానికి సంబంధించిన తాళంచెలు మీడియా ప్రతినిధిపై వేయడం పిచ్చితనమా లేక మొండివైఖరా అర్థం కాని రీతిలో ఉంది. తనకు తానే సొంతగా జిల్లాస్థాయి అధికారులకు ఫోన్ చేయడం
అమ్మాయిలను విద్యార్థులు ఇబ్బంది పెట్టిన విషయాన్ని ఆరా తీస్తే ఆ విషయంపై ఆ విషయాన్ని దాటవేస్తూ గ్రామ పెద్దలకు చెప్పానని నిస్సిగ్గుగా చెప్పడం ఉద్యోగ ధర్మమా? ఇలాంటి వార్డెన్ల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ఘోరంగా తయారవుతుందని దానికి నిదర్శనాలు ఇవే అతని మాటల్లోనే ఫోన్లో సంభాషణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రశ్నించాల్సిన అవసరంప్రతి పౌరునికి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News