అటవీ శాఖ నంద్యాల డివిజన్, ప్రొద్దుటూరు డివిజన్ సరిహద్దులో గల నల్లమల అటవీ ప్రాంతంలోని చింతమాను రస్తాలో దాడులు చేసి రెండు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొని తొమ్మిది మంది తమిళ స్మగ్లర్ల ను అదుపులోకి తీసుకున్నామని రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. రేంజ్ అధికారి తెలిపిన వివరాల మేరకు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు ప్రొద్దుటూరు డివిజన్ సరిహద్దు నుండి రుద్రవరం రేంజ్ పరిధిలోని ఆలమూరు సెక్షన్ ఊట్ల బీట్ పరిధిలో గల అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు కాలి అడుగులు ఆనవాళ్లు గుర్తించిన పెట్రోలింగ్ సిబ్బందికి చింతమానురస్తాలో శబ్దాలు వినపడడంతో అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు ఎర్రచందనం వృక్షాలు నరుకుతున్నట్లు గమనించి నంద్యాల జిల్లా డిఎఫ్ఒ వినీత్ కుమార్ కు సమాచారం అందించారన్నారు. డీఎఫ్ఓ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున సెక్షన్ అధికారులు సిబ్బందితో కలిసి చింతమాను రస్తా ప్రాంతం చేరుకుని తమిళ స్మగ్లర్ల పై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో రెండు ఎర్రచందనం దుంగలు 9 మంది తమిళనాడుకు చెందిన స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న దుఃగలను అహోబిలం డిఆర్ఓ కార్యాలయం తరలించామని, 9 తమిళ స్మగ్లర్లను తిరుపతిలోని ఎర్రచందనం స్పెషల్ కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా నిందితులను రిమాండ్ కు తరలించారని తెలిపారు. సెక్షన్ అధికారులు సిబ్బంది ప్రొటెక్షన్ వాచర్లు మొబైల్ పార్టీ బృందం ఊట్ల బీట్ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారని ఎక్కడ ఎర్రచందనం వృక్షాలు నరికిన ఆనవాళ్లు లభ్యం కాలేదని స్మగ్లర్లు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన వెంటనే సిబ్బంది గుర్తించడంతో రెండు దుంగలు నరికిన వెంటనే స్మగ్లర్లు పట్టు పడ్డారని రేంజ్ అధికారి తెలిపారు. ఈ దాడులలో ఆలమూరు అహోబిలం డి వనిపెంట నూతల సెక్షన్ అధికారులు ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.
Rudravaram: పట్టుబడిన తమిళ ఎర్రచందనం స్మగ్లర్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES