Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుSama Damodar Reddy: చంపేస్తామంటూ సామా దామోదర్ రెడ్డికి బెదిరింపు కాల్

Sama Damodar Reddy: చంపేస్తామంటూ సామా దామోదర్ రెడ్డికి బెదిరింపు కాల్

కేసీఆర్, కేటీఆర్, జీవన్ రెడ్డిపై ఆరోపణలు

ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి కి బెదిరింపు కాల్ వచ్చినట్టు ఆయన స్వయంగా తెలిపారు. నిన్ను ప్రాణాలతో ఉండనివ్వమంటూ, చంపుతామంటూ ఫోన్ చేసిన దుండగులు ఫోన్ చేసినట్టు ఆయన తెలిపారు. నిన్ను చంపడానికి 50 లక్షలు తీసుకున్నాను. నిన్ను ఖతమ్ చేయడానికి కోటి రూపాయల డీల్ కుదిరింద.. ఆ కోటి రూపాయలు నాకు ఇస్తే నిన్ను ఎవరు చంపమన్నారో వివరాలు చెబుతానంటూ .. కోటి రూపాయలు బిట్ కాయిన్ స్కానర్ కు పంపాలని వాట్స్ అఫ్ మెసేజ్ కూడా వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

- Advertisement -

నా వెంట బీహారీ గ్యాంగ్ ఉన్నారు. క్షణాల మీద నిన్ను చంపి పడేస్తారంటూ వారి ఫోటోలు పంపిన దుండగుడి బెదిరింపులతో సామా దామోదర్ రెడ్డి ..తనకు ప్రాణ హాని ఉందని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. IPC 506 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కాగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి KTR పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన.. వారి అండదడలతోనే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని భగ్గుమన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే నా వ్యవసాయ భూమిని కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేసినా శంకర్ పల్లి పోలీసులు పట్టించుకోలేదని.. అప్పటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై కూడా ఆయన ఆరోపణలు చేయటం మరోసారి సంచలనం సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad