Saturday, April 5, 2025
Homeనేరాలు-ఘోరాలుSuryapeta: తాళం పడితే కన్నం పడ్డట్టే

Suryapeta: తాళం పడితే కన్నం పడ్డట్టే

ఇంటికి తాళం పడిందో అతడు కన్నం వేసేస్తాడు. అలాంటి కరుడుకట్టిన దొంగను పట్టుకున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం ఎర్రకుంట తండాకు చెందిన వాంకుడోతు నాగరాజు.. మండల పరిధిలో పగలు సమయంలో బయటి నుంచి ఇంటికి తాళాలు వేసిన ఇళ్లను రెక్కీ చేస్తాడు. రాత్రైతే ఇక ఆ ఇళ్లను దోచేయటాన్ని పనిగా పెట్టుకున్నాడు. నాగరాజును పట్టుకున్న పోలీసులు అతని దగ్గరి నుంచి 14 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తాళాలు తెరిచేందుకు కట్టింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్ ను ఉపయోగించే ఇతను కూలిగా పనిచేస్తున్నట్టు నటిస్తాడని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News