Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుTandur: భారీ చోరి కేసును 72 గంటలో ఛేదించిన పోలీసులు

Tandur: భారీ చోరి కేసును 72 గంటలో ఛేదించిన పోలీసులు

సీసీ కెమెరాల ఆధారంగా అనుమానిత నిందితుడి కదలికల గుర్తింపు

డబ్బులు ఎంత పని అయినా చేయిస్తుంది, ఎంత వరకు అయినా తెగిస్తుందని అంటారు. అది నిజమే. డబ్బులకు ఆశపడి పరిచయం ఉన్నవారి ఇంట్లో నలుగురు స్నేహితులతో కలిసి చోరీ చేశారు. చోరీ చేసిన డబ్బులను కొంతవరకు తీసుకొని మిగిలిన డబ్బులను తరువాత వాటాలు గా పంచుకోవాలని చెత్తకుప్పలో దాచి ఉంచారు. తాండూరు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా అనుమానిత నిందితుడి కదలికలను గుర్తించి,72 గంటల్లోనే నిందితులను రిమాండ్ కు తరలించారు. తాండూరు పోలీసులు గత 13వ తేదీన తాండూరు పట్టణ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో గల వాజిద్ ఇంట్లో రూ.20 లక్షల సొమ్ము చోరీ చేశారు. ఈనెల 15 తేదీన వెలుగులోకి వచ్చింది చాలెంజిగా తీసుకున్న తాండూరు పట్టణ పోలీసులు ఛేదించారు బుధవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించిన వివరాలపై విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. చోరీ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు.

- Advertisement -

ఎ-1 అబుబకర్ ఖురేషీ – అభియాన్ ఖురేషీ ఇద్దరు బందువులు (చిన్నమ్మ , పెద్దమ్మ కొడుకులు అబకర్ కు పిర్యది అయిన వాజిద్ అలి కి వీరు ముందే పరిచయం ఉన్నది మరియు పిర్యది. వాజిద్ అలి దగ్గర కొన్ని రోజులు పని కూడ చేసాడు. వాజిద్ అలి తేది14 జులై 2023 రోజు పెళ్ళికి వెలుతున్నడనే విషయం తెలుసుకొని వాజిద్ అలీ ప్లాట్ అమ్మిన డబ్బులు ఉన్నాయని విషయం తెలిసి వాటిని దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో తన పెద్దమ్మ కొడుకు అభిసోఫియాన్ కు ఒక రోజు ముందే సాయంత్రం రాజీవ్ కాలనీ కి వెళ్ళి చెప్పినాడు. దానికి అభిసోఫియాన్ ఖురేషీ కూడా ఒప్పుకోని మన ఇద్దరమే కాకుండా కాలనీ లో ఉండే ఖలీల్, తౌసిఫ్, కిట్టు ( దీపక్ ) లతో కలిసి చేద్దాం అని వారిని పిలిపించి అబూబకర్ కు పరిచయం చేసి 14వ తేదీన సాయంత్రం అందరం కలుద్దాం అని వెళ్ళిపోయి, 14 నాడు పిర్యాది అయిన వాజిద్ అలీ హైదరాబాద్ వెళ్లిన విషయం తెలుసుకొని అబూబకర్ సాయంత్రం 7: 30 గంటల సమయంలో వీరు అంతా కలుసుకొని అదేరోజు రాత్రి 11 గంటల తరువాత చోరీ చేద్దాం అనుకున్నారు. అదేవిదంగా వారు అంతా కలుసుకొని అబూబకర్, ఖలీల్ లను హీరో హోండా ప్యాషన్ ప్రొ నెంబర్ AP 28 AX 8265 పై అభిసొపియాన్ ఖురేషీ పంపించి ఖలీల్ కు దొంగతనం చేయాల్సిన ఇల్లుని చూపించమని చెప్పినాడు . అబూబకర్ , ఖలీల్ లు మోటార్ సైకిల్ పైన వెళ్ళి రాయల్ కాంట దగ్గర ఒక లారీ లో నుంచి ఇనుపరాడ్ తీసుకొని బ్రిడ్జ్ కిందగల వాజీద్ అలీ ఇంటి దగ్గర వెనుక బాగంలో ఆగి అభిసోఫియాన్ ఖురేషీ లకు ఫోన్ చేయగా అభిసొఫియాన్ ఖురేషీ తాసిఫ్, కిట్టు లు కూడా TS 34 TA 4531 నెంబర్ గల ఆటో లో బ్రిడ్జ్ కిందకు వచ్చారు. అభిసొఫియాన్ ఖురేషీ తొసిఫ్, కిట్టు లు బ్రిడ్జ్ కింద నిలబడి చుట్టూ గమనిస్తూ ఉండగా అబూబకర్ ఖలీల్ లు ఇద్దరు వాజిద్ అలీ ఇంటి వెనుక గోడ దగ్గరకు వెళ్ళి గోడ దూకి ఖలీల్ ఇనుప రాడ్ తో ఇల్లు తాళం పగులకొట్టి బీరువా తాళాలు అక్కడే పక్కన ఉండగా వాటితో బీరువా తీసి అందులో గల డబ్బుల సంచిని తీసుకొని వచ్చాడు. అట్టి డబ్బుల సంచిని తీసుకొని అబుబకర్ ఖురేషీ బండి పైన ఎక్కి అభిసొపియాన్ ఖురేషీ కి ఫోన్ చేసి మేము మాణిక్ నగర్ వైపు నుండి తాండూర్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు వస్తాము . మీరు బస్ స్టాండ్ వైపు నుండి రండి అని చెప్పి వెళ్ళినారు. అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కలుసుకొన్నాక ఖలీల్ అభిసోఫియాన్ ఖురేషీ ఆసిఫ్ కిట్టు లు ఉన్న ఆటో లో డబ్బులతో పాటు కూర్చొని రాజీవ్ గృహకల్ప వైపు వెళ్ళినారు. అబుబకర్ ఖురేషీ బైక్ పై వల్ల ఆటో వెంబడి వచ్చాక అందరూ కలిసి అక్కడ డబ్బుల సంచిని తెరిచి అందులో ఉన్న డబ్బులను లెక్కపెట్టుకొనగా 20 లక్షలు ఉండగా, అందులో నుంచి ఒక లక్ష తీసుకొని అందరూ రూ.20,000 లను ఒక్కొకరి చొప్పున పంచుకొని మిగతా వాటిని వారం రోజుల తరువాత పంచుకొందాము అని వాటిని మళ్ళీ అట్టి బ్యాగు లో ఉంచి వాటిని తాండూర్ లో యాదిరెడ్డి చౌక్ దగ్గరలో గల పాతబడిన 365 హోటల్ లో చెత్త కుప్పలో పెట్టినారు, దొంగతనముకు ఉపయోగించిన ఇనుపరాడ్ ను ఆటో లో పెట్టి అట్టి ఆటో, బైక్ లని అదే హోటల్ లో ఉంచినారు. ఆతరువాత రాత్రి ఒంటి గంట తరువాత అందరూ ఎవరి ఇంటికి వారు వెళ్లారు. వారిద్దరిని ఎ-1, ఎ-3 లు కూడా 20,000 రూపాయలను ఖర్చు చేసినారు. తరువాత 19,00,000/- రూపాయలను రికవరీ చేసుకోవడం జరిగిందన్నారు. ఇన్వెస్టిగేషన్ జరిపి ఇట్టి దొంగతనం జరిగిన ఇంటికి చుట్టుప్రక్కల ఉన్న సిసి ఫోటేజ్ లో చెక్ చేయడం జరిగినది. వాజీద్ అలీ’తో ఎవరెవరు రోజు కలిసే వారు మాట్లాడేవారు అనే విషయములో పరిశోదన చేయుచుండగా సిసి ఫోటేజ్ లో దొంగతనం జరిగిన రాత్రి అబుబకర్ ఖురేషీ కదలికలు మాణిక్ నగర్, పెంటయ్య విగ్రహం ఏరియా లో ఉండటం తో అతని గురించి నిఘా పెట్టి బుధవారం ఉదయం 5 గంటల సమయములో అతను రాయల్ కాంట దగ్గర అతని ఇంటికి వస్తుండగా మఫ్తిలో ఉన్న పోలీసులు పట్టుకొని తీసుకొని వచ్చి విచారించగ నేరం చేశామని వారే ఒప్పుకున్నారు. మిగతా నిందితులను ఎ-2 ఖలీల్, తౌసిఫ్ ఎ-5, దీపక్ కట్టు పరారీలో ఉన్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News