Thursday, July 4, 2024
Homeనేరాలు-ఘోరాలుTandur sand mafia: తాండూరులో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

Tandur sand mafia: తాండూరులో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

అనుమతి లేదు, అధికారుల భయం లేదు

రాత్రి పగలు తేడా లేకుండా తాండూరులో అక్రమార్కులు జోరుగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. గత 4 రోజుల నుండి రాత్రి పగలు తేడా లేకుండా ప్రధాన రోడ్డు వెంబడే అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని కాగ్నా నది నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జిల్లా కలెక్టర్ 600 రూపాయలకే ట్రాక్టర్ ఇసుక పొందవచ్చు అని ప్రకటించారు. దీంతో అనుమతులు ఇచ్చిన మొదటి రోజే  లక్ష 4 వేల 400 రూపాయల ఆదాయం నియోజకవర్గంలోని యాలాల మండలం నుండి ప్రభుత్వానికి వచ్చింది.

- Advertisement -

ఇదిలా ఉంటే ఇటు 3 ట్రాక్టర్ లకు అనుమతులు పొంది పదుల సంఖ్యలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. శనివారం ఎలాంటి అనుమతులు లేకుండా ఉదయం నుండే అక్రమ ఇసుక రవాణా కొనసాగింది. అధికారుల హస్తం కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. అక్రమ రవాణాకు చెక్ పెడతామన్న అధికారులకు తెలియకుండానే అక్రమ  రవాణా కొనసాగుతుందా….?  అక్రమ ఇసుక రవాణాకు అధికారులే అండగా నిలుస్తున్నారా…? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News