వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన నిందితులకు వినూత్న రీతిలో శిక్షలు ఖరారు చేయటం అందరినీ ఆలోచింపచేసేలా ఉంది. తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో మద్యం తాగి వాహనాలు నడిపిస్తూ పట్టుబడిన నలుగురు మందుబాబులకు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు జరిమానాతో పాటు ₹1000 పండ్లు కొనుగోలు చేసి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు అందజేయాలని, జిల్లా మెజిస్ట్రేట్ వినూత్న రీతిలో తీర్పునిచ్చారు.
జిల్లా మెస్సేజ్ ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ నలుగురు నిందితులు తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 30 మంది రోగులకు పండ్లను పంపిణీ చేశారు. జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ విధించిన శిక్షతో అటు మందుబాబులకు మానవత్వం తెలియజేస్తూనే సమాజానికి సేవ చేయాలనే హితబోధ కలిగించినట్లు శిక్ష ఉందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
Tanduru: డ్రంకన్ డ్రైవ్ కు వెరైటీ శిక్ష
రోగులకు వెయ్యి రూపాయల పండ్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES