Friday, April 4, 2025
Homeనేరాలు-ఘోరాలుThalakondapalli: తలకొండపల్లిలో యువకుడు అదృశ్యం

Thalakondapalli: తలకొండపల్లిలో యువకుడు అదృశ్యం

సప్పిడి కుమార్ అనే యువకుడు అదృశ్యం

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో సప్పిడి కుమార్ అనే యువకుడు అదృశ్యం అయ్యాడు. వివరాలోకి వెలుతే తలకొండపల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన సప్పిడి పద్మమ్మ వెంకటయ్య దంపతుల పెద్ద కుమారుడు సప్పిడి కుమార్ గత నెల 25న హైదరాబాదులోని కర్మన్‌ఘట్‌లో ఉంటున్న తన చెల్లెలు వరలక్ష్మి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అదృశ్యమైనట్లు తన సోదరుడు సప్పిడి మహేష్ పిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ ఎ. శ్రీకాంత్ తెలిపారు. గత నెల 25 నుండి కుమార్ ఫోన్ స్వీచ్చాఫ్ రావడంతో తమ బందువులు,స్నేహితులకు సమాచారం ఇచ్చిన సప్పిడి కుమార్ అచూకి లభించకపోవడంతో ఈ విషయం పట్ల కుమార్ సోదరుడు సప్పిడి మహేష్ సోమవారం స్థానిక పోలీసు స్టేషనులో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News