Saturday, July 27, 2024
Homeనేరాలు-ఘోరాలుThorruru: ఫాం ల్యాండ్ పేరుతో వెంచర్ల ప్లాటింగ్

Thorruru: ఫాం ల్యాండ్ పేరుతో వెంచర్ల ప్లాటింగ్

ఇవేవీ పట్టని అధికారులు రిజిస్ట్రేషన్ చేసి..

ఫాం ల్యాండ్ ముసుగులో రియ‌ల్ వ్యాపారం సాగిస్తున్న అక్రమ వెంచ‌ర్లపై వరంగల్ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రిస్తోంది. . రాష్ట్ర ప్రభుత్వం పంచాయ‌తీ లే అవుట్ల ప‌ర్మిష‌న్లను కూడా ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో డీటీసీపీ లే అవుట్‌ అప్రూవ‌ల్ అనేది త‌ప్పనిసరిగా మారింది. ఫాం ల్యాండ్ల వెంచ‌ర్ల పేరుతో ప్లాటింగ్ చేస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కుతున్నా వేడుకగా చూస్తుండ‌టం గ‌మ‌నార్హం.

- Advertisement -

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామ రెవెన్యూ పరిధిలోని ఆర్ & బి కాలని గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వె నెంబర్ (195)లో బై నెంబర్ లతో గుంటల్లో రిజిస్ట్రేషన్ లు చేసి అమాయక ప్రజలకు అమ్మి మోసం చేస్తున్నారు. పండ్ల పేరు చెప్పి కాయలు అమ్మినట్టు చెట్ల పేరు చెప్పి ప్లాట్లను గుంటల్లో బై నెంబర్ లతో రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం..ఇదంతా ఇలా ఉంటే ఫాం ల్యాండ్ నిర్వాహకుడు ఎలాంటి అనుమతులు లేని అక్రమ వెంచర్ లో 3గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోని గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టుకోవడం గమనార్హం..ఇదంతా తెలిసిన పంచాయతి అధికారులు ఇంటి యజమానికి నోటిసులు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గొర్లు మేపుకోవాల్సిన భూమిలో ఫాం ల్యాండ్..

ప్రభుత్వం కొన్ని నిబంధనలు జారీ చేస్తూ అప్పటి ప్రభుత్వం కుల సంఘాలను బట్టి ప్రతి గ్రామంలో కులాలకు కొంత భూమిని కేటాయించింది. అదే రీతిలో మొరిపిరాల, ఆర్&బి కాలనిలో ఉన్న యాదవులు కోసం గొర్లు, మేకలు మెపుకోవడానికి 195సర్వే నెంబర్ లో 16 ఎకరాల భూమిని కేటాయించింది.యిట్టి భూమిలో ఫాం ల్యాండ్ ఏర్పాటు చేసి కేవలం ఒక గుంటకు పట్టా చేసి కోనుగోలు దారులకు పాసు బుక్ లు జారీ చేశారు. ఈ భూమి యాదవులకు సంబంధించింది కాబట్టి కొనడానికి, అమ్మడానికి వీలు లేదని కాని యస్.వి.ఆర్ సంస్థ అమాయక ప్రజలను మోసం చేస్తుందని కొంతమంది గ్రామస్థులు తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో గ్రివెన్స్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తహశీల్దార్ సత్యనారాయణ కనుసన్నల్లో రిజిస్ట్రేషన్ లు:

రాయపర్తిలో అప్పటి త‌హ‌సీల్దార్ కుసుమ సత్యనారాయణ భూ అక్రమ రిజిస్ట్రేష‌న్లకు తెగ‌ప‌డ్డారు. రాయపర్తి మండ‌లం ఆర్ & బి గ్రామంలో యస్ వి యస్ ఇన్ఫా డెవ‌ల‌ప‌ర్స్ పేరిట నిర్వహిస్తున్న ఫాం ల్యాండ్స్ ప్లాట్ల రిజిస్ట్రేష‌న్లు ఎడ‌పెడా చేసేశారు. ఫాం ల్యాడ్స్ ముసుగులో కొన‌సాగుతున్న రియ‌ల్ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన అధికారే బాజాప్త రిజిస్ట్రేష‌న్లు చేయడం గ‌మ‌నార్హం. నాన్ లే అవుట్‌, ఫాం ల్యాండ్స్ పేరుతో జ‌రుగుతున్న గుంట‌, రెండు మూడు గుంట‌ల భూముల‌ను రిజిస్ట్రేష‌న్లు చేయవ‌ద్దని ప్రభుత్వం అప్పట్లో నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు స‌వివ‌రమైన ఆదేశాల‌ను ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధ‌న‌ల ప్రకారం 10 గుంట‌ల కంటే మించి ఉన్న భూమిని మాత్రమే బై నెంబ‌ర్లతో రిజిస్ట్రేష‌న్లు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను అప్పటి రాయపర్తి త‌హ‌సీల్దార్ స‌త్యనారాయ‌ణ తుంగ‌లో తొక్కి య‌థేచ్ఛగా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి గుంటల్లో రిజిస్ట్రేషన్ లు చేయడం గమనార్హం. అప్పటి త‌హ‌సీల్దార్ స‌త్యనారాయ‌ణ హ‌యంలోనే 60 ప్లాట్లపైచిలుకు రిజిస్ట్రేష‌న్లు జ‌రిగిపోవ‌డం గ‌మ‌నార్హం. రాయపర్తి కేంద్రంగా జ‌రిగిన ఫాం ల్యాండ్ రియ‌ల్ మోసంపై క‌లెక్టర్ స్వయంగా దృష్టి సారిస్తే త‌హ‌సీల్దార్‌తో పాటు ఇత‌ర రెవెన్యూ అధికారుల పాత్ర బ‌హిర్గతం కానుంది. మ‌రి జిల్లా బాస్ స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News