Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుForced Abortion: కొడుకు కోసం దారుణం.. రెండుసార్లు అబార్షన్ చేయించి, మామ, మరిదితో పడుకోవాలని ఒత్తిడి

Forced Abortion: కొడుకు కోసం దారుణం.. రెండుసార్లు అబార్షన్ చేయించి, మామ, మరిదితో పడుకోవాలని ఒత్తిడి

Woman Pressured To Sleep With In-Laws For A Son: ఉత్తరప్రదేశ్‌లో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగుచూసింది. వారసుడుని కనాలని ఒత్తిడి చేస్తూ మెహక్ ఖాన్ అనే మహిళపై ఆమె అత్తమామలు రెండుసార్లు అబార్షన్ చేయించారు. కొడుకు పుట్టాలంటే ఆమె తన మామతో లేదా మరిదితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశారు.

- Advertisement -

మెహక్ ఖాన్ 2021లో షా ఫహీద్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు లక్షల రూపాయలు, కారును కట్నంగా డిమాండ్ చేయడం ప్రారంభించారు. వారి డిమాండ్‌లను తిరస్కరించడంతో, ఆమెను తరచుగా వేధించేవారు. రోజువారీ దాడులతో ఆమెకు తీవ్రమైన వెన్నెముక గాయాలు అయ్యాయి.

ALSO READ: Man Kills Wife: భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం.. చంపి ఇంట్లోనే పాతిపెట్టిన భర్త

రెండుసార్లు లింగ నిర్ధారణ చేసి అబార్షన్

మెహక్ ఒక కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఆమె మళ్లీ గర్భం దాల్చినప్పుడు, శిశువు లింగాన్ని తెలుసుకోవడానికి స్కానింగ్ చేయించారు. రెండుసార్లు పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని తేలడంతో బలవంతంగా ఆమెకు అబార్షన్ చేయించారు.

దీంతో మెహక్ అత్తగారు, ఆడపడుచు మరింత దారుణానికి ఒడిగట్టారు. కొడుకు పుట్టాలంటే ఆమె తన మామతో లేదా మరిదితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశారు. అంతేకాకుండా, తన మామ, మరిది తనపై పలుమార్లు లైంగికంగా వేధింపులకు పాల్పడి, దుర్భాషలాడారని కూడా బాధితురాలు ఆరోపించింది. ఈ విషయాలన్నీ తన భర్తకు చెప్పినా, అతను పట్టించుకోలేదని తెలిపింది.

ALSO READ: Kaveri Travels Bus Accident: పండక్కి ఇంటికి వచ్చి తిరిగి వెళ్తూ..సజీవదహనమైన యాదాద్రి యువతి!

కట్నం తీసుకురావాలంటూ ఇంటి నుంచి గెంటివేత

కొన్ని రోజుల క్రితం మెహక్ ఖాన్‌ను, ఆమె కుమార్తెను అత్తమామలు దారుణంగా కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశారు. కట్నం డిమాండ్లు తీర్చే వరకు ఇంటికి తిరిగి రావద్దని ఆమె అత్తమామలు హెచ్చరించారు.

మెహక్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె భర్త, అత్తగారు, మరిది, ఆడపడుచులు సహా మొత్తం ఏడుగురు కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

ALSO READ: Man Stabs Brother To Death: ఆస్తి తగాదాలో రాక్షసత్వం.. కత్తితో అన్న, వదినలను పొడిచి చంపిన తమ్ముడు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad