అన్నమయ్యజిల్లా మదనపల్లెలో కత్తిపోట్లు కలకలం సృష్టించింది. ఇద్దరు యువకులపై పట్టణానికి చెందిన వేణుగోపాల్ కత్తితో దాడి(attacked)కి పాల్పడ్డాడు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల రామ్ నగర్ పార్కులో ఘటన జరిగింది.
కత్తి దాడిలో గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. క్షతగాత్రులు రామ్ నగర్ కు చెందిన సురేంద్ర బాబు(38) శ్రీనివాసులు (38)గా పోలీసులు గుర్తించారు.
- Advertisement -
దాడికి పాల్పడిన మదనపల్లి పట్టణం కమ్మ గడ్డ వీధికి చెందిన వేణుగోపాల్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు టూ టౌన్ పోలీసులు.