అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఆదివారం ఎగువ అహోబిలంలో అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శఠగోప యతీంద్ర మహదేషికన్ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు వేణుగోపాలన్, మఠం ప్రతినిధి సంపత్, పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉదయం ధ్వజారోహణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి దేవదేవుడైన స్వామి వారు సింహ వాహనంపై ఆశీనుడయ్యారు. స్వామివారికి సాంప్రదాయ బద్ధంగా ప్రత్యేకంగా పుష్ప ఫల అలంకరణలతో, వేదమంత్రోత్సవాల మధ్య భాజా భజంత్రులు, మేళతాళాలతో విద్యుత్ దీపాలంకరణల మధ్య బాణాసంచా కాంతులతో నరసింహ స్వామి సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. దిగువ అహోబిలంలో సాయంత్రం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శఠగోప యతీంద్ర మహదేషికన్ నేతృత్వంలో ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ వేద పండితులు సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు.