Auspicious yogas on Diwali 2025: నేడు(అక్టోబర్ 20) దీపావళి. గ్రహాల సంచారం పరంగా కూడా అక్టోబర్ 20 చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇదే రోజు బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని సృష్టించబోతున్నాడు. ఇదే రోజు చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించి శుక్రుడుతో కలిసి అరుదైన రాజయోగాన్ని రూపొందించబోతున్నాడు. మరోవైపు బృహస్పతి కూడా హంస మహాపురుష రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు. పైగా సర్వార్థ సిద్ది యోగం, అమృత యోగం కూడా ఇదే రోజు ఉన్నాయి. ఇన్ని శుభకరమైన యోగాల కారణంగా కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహ రాశి
దీపావళి నుండి సింహరాశి వారి అదృష్టం మారబోతుంది. వ్యాపారం లాభసాటిగా మారుతుంది. మీరు కెరీర్ లో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. మీకు ప్రతి పనిలో కుటుంబ సభ్యుల సపోర్టు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. రుణ విముక్తి నుండి బయటపడతారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.
తుల రాశి
ఈరోజు ఏర్పడబోయే రాజయోగాలు తులారాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. మీ కీర్తి నలుదిక్కులకు వ్యాపిస్తుంది. మీకు ఉన్నతాధికారుల సపోర్టు లభిస్తుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. పిల్లలతో మంచి సమయం గడుపుతారు. అనారోగ్యం నుండి బయటపడతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను ఆర్జిస్తారు. సొంత వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.
మేషరాశి
దీపావళి నాడు ఏర్పడబోయే శుభకరమైన యోగాలు మేషరాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా దీపావళి వేడుకను జరుపుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగుంటుంది. ఊహించని విధంగా వ్యాపారం విస్తరిస్తుంది. కెరీర్ లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆకస్మిక ధనార్జన చేస్తారు. సంసారం జీవితం సాఫీగా సాగుతోంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకోని పురోగతి ఉంటుంది.
Also Read: Diwali 2025 -దీపావళి తర్వాత శక్తివంతమైన రాజయోగం.. ఈ మూడు రాశులకు అఖండ ధనయోగం..
మిథున రాశి
అక్టోబర్ 20వ తేదీ మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగులకు శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కు కూడా అవకాశం ఉంది. సమాజంలో పాపులారిటీ పెరుగుతుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు. మీరు కష్టాల నుండి బయటపడతారు. ఉద్యోగం మరియు పిల్లలకు సంబంధించిన గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది..


