Auspicious yogas in Mahanavami 2025: దసరా నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే మహర్నవమి నాడు కొన్ని గ్రహాల కలయిక ఏర్పడబోతుంది. దీని కారణంగా కొన్ని ప్రత్యేకమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. బుధాదిత్య రాజయోగం, భద్ర యోగం, నవపంచమ యోగం, షడాష్టక యోగంతోపాటు అర్ధ కేంద్ర రాజయోగం కూడా ఏర్పడనుంది. ఈ శుభ యోగాల ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ఈ యోగాల వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
కన్యా రాశి
మహర్నవమి నాడు సంభవించబోయే శుభకరమైన యోగాల వల్ల కన్యా రాశి వారి తలరాతను మారబోతుంది. మీ సంపద ఓ రేంజ్ లో పెరుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు జాబ్ లభిస్తుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ దగ్గరి నుంచి అప్పుగా తీసుకున్నవారు తిరిగి ఇస్తారు. కెరీర్ లో అత్యున్నత స్థాయికి వెళతారు. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తోంది.
సింహరాశి
సింహరాశి వారిపై గ్రహాల కలయిక కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. కెరీర్ లో విజయం సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వ్యాపారులు విపరీతమైన లాభాలను పొందుతారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు.
Also Read: Astrology -త్వరలో శని, చంద్రుల కలయిక.. అక్టోబర్ నుంచి ఆ 3 రాశులకు కష్టాలు షురూ..
వృషభరాశి
మహర్నవమి నాడు శుభయోగాలు ఏర్పడటం వృషభరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. దుర్గాదేవి ఆశీస్సులతో మీర ఎలాంటి కార్యాన్నైనా సులభంగా సాధించగలుగుతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మీరు మంచి పొజిషన్ కు వెళతారు. బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుంది. బిజినెస్ చేసేవారు ఊహించని లాభాలను పొందుతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. భార్యభర్తలు మంచి సమయం గడుపుతారు.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. పండితుల అభిప్రాయాలు, ఇంటర్నెట్ డేటాను పరిగణనలోకి తీసుకుని ఈ కథనాన్ని రూపొందించాం. దీనికి ఎటువంటి శాస్త్రీయత లేదు. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించలేదు.


