Monday, November 17, 2025
HomeదైవంBramhostavam: ఆపదలను తీర్చే ఐనవోలు మల్లన్న

Bramhostavam: ఆపదలను తీర్చే ఐనవోలు మల్లన్న

ఈ నెల 13నుండి వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు భక్తులంతా హాజరుకావాల్సిందిగా, భక్తులకు తగు ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ ఆహ్వానం పలుకుతోంది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి, ఆహ్వాన పత్రికను అందజేశారు.

- Advertisement -

ఆపదలను తీర్చే మల్లన్నగా ఇక్కడి స్వామి ప్రసిద్ధి. తెలంగాణ జానపదుల జాతరగా కూడా ఐనవోలుకు ప్రత్యేక స్థానం ఉంది. సంక్రాంతి పండుగకు ముందు ప్రారంభమై ఉగాది వరకు ఇక్కడ జాతర సాగుతుంది. స్వామి వారికి పట్నాలు వేసి మొక్కులు తీర్చుకోవటం ఇక్కడ ప్రత్యేకత. 1100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న దేవాలయం ఐనవోలు మల్లన్న దేవాలయం. వరంగల్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad