Budh Chandra Transit 2025: విశ్వంలో గ్రహాల పరివర్తన కాలానుగుణంగా జరుగుతుంది. మరో మూడు రోజుల్లో చంద్రుడు అధిపతిగా ఉన్న కర్కాటకరాశిలోకి బుధుడు, మెర్క్యూరీ అధిపతిగా ఉన్న కన్యారాశిలోకి చంద్రుడు సంచరించడం వల్ల పరివర్తన యోగం ఏర్పడుతుంది. జూలై 30న బుధ, చంద్రుల చేయబోతున్న ఈ యోగం వృషభం, మిథునం, కన్య, మకరం, మీన రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. రాబోయే మూడు రోజుల్లో వీరు చేపట్టే ప్రతి కార్యం నెరవేరుతోంది.
కన్య
బుధ, చంద్రుల రాశి మార్పు కన్యారాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలను చూస్తారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలోని గొడవలు ముగిసి..సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది.
వృషభం
బుధ, చంద్రుల చేస్తున్న పరివర్తన యోగం వల్ల ఈరాశి యెుక్క అన్నీ సమస్యలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని పురోగతి ఉంటుంది. కొన్ని శుభవార్తలు కూడా వింటారు.ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలమిస్తాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారు లాభపడతారు.
మిథునం
పరివర్తన యోగం వల్ల మిథునరాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనేక రకాలుగా ఆదాయం వస్తుంది. రుణంగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జీతం పెరగడంతోపాటు ఆగిపోయిన ప్రమోషన్ కూడా వస్తుంది. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. కెరీర్ లో ఊహించని ఎదుగుదల ఉంటుంది.
Also Read: August 2025 Festivals – ఆగస్టులో రాబోతున్న పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?
మకరం
ఈరాశి వారికి పరివర్తన యోగం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలమిస్తాయి. విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యే యోగం ఉంది. జాబ్ చేసేవారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీరు కోరుకున్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. రాబడి పెరుగుతుంది. ఇతరులతో పరిచయాలు పెరుగుతాయి. మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు.
మీనరాశి
పరివర్తన యోగం వల్ల మీ జీవితాల్లోకి వెలుగులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారు. పెళ్లి యోగం ఉంది. విదేశాల్లో స్థిరపడాలన్న మీ కోరిక ఫలిస్తుంది. ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సఫలమవుతాయి. డబ్బును పొదుపు చేస్తారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉండబోతుంది. మీరు ప్రేమలో పడతారు.
Also Read: Shani Transit – ఆగస్టు 01న అరుదైన రాజయోగం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..


