Sunday, November 16, 2025
HomeTop StoriesCentipede : మీ ఇంట్లో ఈ రోజున జెర్రి కనిపించిందా..అయితే మీకు కలిగే ఫలితాలు ఇవే!

Centipede : మీ ఇంట్లో ఈ రోజున జెర్రి కనిపించిందా..అయితే మీకు కలిగే ఫలితాలు ఇవే!

Seeing Centipede Good Or Bad: ఇంట్లో ఎప్పుడో ఒకసారి కనిపించే జీవుల్లో జెర్రి లేదా శతపాది ఒకటి. దీని పొడవైన కాళ్లు, వేగంగా పరిగెత్తే తీరు చాలా మందిని భయపెడుతాయి. కానీ పూర్వం నుంచి ఈ జెర్రి కనిపించడం ఒక సంకేతంగా భావిస్తారు. చాలామంది దీనిని అశుభంగా అనుకున్నా, కొన్ని సంప్రదాయ విశ్వాసాలు మాత్రం జెర్రి దర్శనం సంపద, అదృష్టం లేదా సిరికి సూచనగా పండితులు వివరిస్తుంటారు. “శతపాదిని చూస్తే సంపద వస్తుంది” అనే నానుడి ఈ నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది.

- Advertisement -

హాలు లేదా బెడ్‌రూమ్‌లో…

ఇంట్లో జెర్రి ఎక్కడ కనిపిస్తుందన్నది కూడా ముఖ్యమని పెద్దలు అంటారు. గేటు దగ్గరా, తలుపు దగ్గరా, వంటగదిలోనా, దేవాలయ మూలలోనా, హాలు లేదా బెడ్‌రూమ్‌లోనా జెర్రి కనపడితే దానిని శుభంగా భావిస్తారు. ఇంటికి కొత్త ఉత్సాహం, ఆర్థిక స్థిరత్వం లేదా కొత్త అవకాశాల ప్రవేశం జరుగుతుందనే విశ్వాసం ఉంది. అయితే బాత్రూంలో జెర్రి కనపడితే మాత్రం అది అశుభ సూచనగా చెబుతుంటారు. ఈ సందర్భంలో జాగ్రత్తగా ఉండమనే సూచనగా భావిస్తారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/rahu-transit-in-shatabhisha-brings-luck-for-aries-and-virgo/

వారంలోని ప్రతి రోజు..

జెర్రి దర్శనం రోజుకు అనుగుణంగా కూడా భిన్నమైన ఫలితాలను కలిగిస్తుందనే సంప్రదాయ నమ్మకం ఉంది. ఉదాహరణకు, వారంలోని ప్రతి రోజు ఈ సంకేతం వేరువేరుగా అర్థం చెప్పుతుందని చెబుతారు.

సోమవారం జెర్రిని చూస్తే…

సోమవారం జెర్రిని చూస్తే దైవానుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ రోజు కనిపించిన జెర్రి మనకు ఆధ్యాత్మిక బలాన్ని పెంచుతుంది, కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి అని చెబుతారు. రాహుకాలం లేదా యమగండం వంటి సమయాలు దీనిపై ప్రభావం చూపవు.

మంగళవారం జెర్రి దర్శనం…

మంగళవారం జెర్రి దర్శనం వాహన సంబంధిత అదృష్టానికి, ఆరోగ్య పరంగా కోలుకోవడానికి, వివాహం లేదా భూమి వ్యవహారాల్లో పురోగతికి సంకేతంగా ఉంటుంది. అలాగే ఆర్థిక లాభాలు లేదా బ్యాంకు నిల్వలు పెరగడం వంటి శుభ సూచనగా కూడా భావిస్తారు.

బుధవారం ఈ జీవిని చూస్తే..

బుధవారం ఈ జీవిని చూడటం అనుకోని మార్పులకు సూచనగా ఉంటుంది. ఉద్యోగ మార్పు, కొత్త అవకాశాలు, లేదా కొత్త విషయాల్లో జ్ఞానం పెరగడం వంటి పరిణామాలు జరిగే అవకాశముందని విశ్వసిస్తారు. ఈ రోజు జెర్రి కనపడితే ఆలోచనల్లో స్పష్టత, నిర్ణయాల్లో ధైర్యం వస్తుందని చెబుతారు.

గురువారం జెర్రిని చూస్తే..

గురువారం జెర్రిని చూస్తే అదృష్టం తిరిగి మన వైపు వస్తుందనే సంకేతంగా పండితులు చెబుతుంటారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించవచ్చు, లేదా ఊహించని ఆర్థిక లాభాలు రావచ్చు. పనిలో పదోన్నతి లేదా వ్యాపారంలో లాభాలు రావడానికీ ఇది సూచనగా భావిస్తారు. బ్యాంకు రుణాలు లేదా పెట్టుబడుల వంటి ఆర్థిక విషయాల్లో విజయావకాశాలు పెరుగుతాయని పెద్దలు అంటారు.

శుక్రవారం జెర్రి కనిపించడం ..

శుక్రవారం జెర్రి కనిపించడం దైవ కృపను సూచిస్తుంది. ఈ రోజు చేపట్టిన పనులు సాఫల్యాన్ని సాధిస్తాయని చెబుతారు. బహుమతులు పొందడం, బంగారం కొనడం, లేదా కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు రావచ్చు. మొత్తం మీద శుక్రవారం జెర్రి దర్శనం శుభ సంకేతంగా చెబుతుంటారు.

శనివారం జెర్రిని చూడటం…

శనివారం ఈ రోజు జెర్రిని చూడటం న్యాయానికి, సత్యానికి గెలుపు సూచనగా భావిస్తారు. చట్టపరమైన కేసులు లేదా భూమి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయని నమ్మకం ఉంది. కష్టకాలం తర్వాత సమతుల్యత ఏర్పడుతుందని, మన కృషికి న్యాయం దక్కుతుందని ఈ రోజు సూచిస్తుంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/karthika-masam-lamp-lighting-rules-explained-by-chaganti-koteshwara-rao/

ఆదివారం జెర్రి కనపడటం..

ఆదివారం జెర్రి కనపడటం ఆరోగ్యపరమైన మెరుగుదలకి, ఆత్మవిశ్వాసం పెరగడానికి సూచనగా ఉంటుంది. ఈ రోజు కనిపించే జెర్రి మనలో ఉత్సాహాన్ని నింపుతుందని, కష్టాల్ని ఎదుర్కోవడంలో ధైర్యం ఇస్తుందని భావిస్తారు. ఇతరుల నుంచి మద్దతు లభించడం, కుటుంబంలో సఖ్యత పెరగడం వంటి శుభ ఫలితాలు కలగవచ్చు.

మొత్తం మీద ఇంట్లో జెర్రి దర్శనం చాలా సందర్భాల్లో శుభ సూచనగా పెద్దలు, పండితులు చెబుతుంటారు. ఇది భయపడాల్సిన జీవి కాదు, ప్రకృతిలో భాగంగా ఉండే ఒక సంకేతం మాత్రమే. పాత సంప్రదాయాల ప్రకారం, జెర్రిని చూడడం అంటే కొత్త శక్తి, సమృద్ధి, దైవ ఆశీస్సులు మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయని నమ్మకం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad