Tuesday, September 17, 2024
HomeదైవంChagalamarri: శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక పౌర్ణమి వేడుకలు

Chagalamarri: శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక పౌర్ణమి వేడుకలు

జ్వాలతోరణానికి పోటెత్తిన భక్తులు

నంద్యాల జిల్లా చాగలమర్రిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్త శివాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు కార్తీకదీపాలు వెలిగించారు. శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థాన ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకదీపం జ్వాలాతోరణం, పల్లకీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జ్వాలాతోరణం కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దాదాపుగా 500 మందికి పైగా అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, జి.శివ నాగప్ప, కె. రాజేంద్ర ప్రసాద్, జి. నాగ రమేష్, సి. చంద్రమౌళి, ఎ. నాగేంద్ర ప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News