Wednesday, October 30, 2024
HomeదైవంChagamalarri: చాగలమర్రి ఆర్యవైశ్య సభచే శమీ దర్శనం

Chagamalarri: చాగలమర్రి ఆర్యవైశ్య సభచే శమీ దర్శనం

ధనలక్ష్మి దేవిగా అమ్మవారు

తొమ్మిదవ రోజు నవమి సందర్భంగా పగలు ధనలక్ష్మి దేవిగా కొలువు దీరింది. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో నవరాత్రుల్లో భాగంగా సోమవారం తొమ్మిదవ రోజు అమ్మవారు పగలు ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.అదే విధంగా కైప వెంకట నరసింహ శాస్త్రి ఆధ్వర్యములో మధ్యాహ్నం అమ్మవారిశాలలో వేద పండితులతో ఆలయ అధ్యక్షుడు వంకదారా లక్ష్మణ బాబు , ధర్మకర్త క్రిష్ణం శివ ప్రసాద్ ఆధ్వర్యములో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.అదే విధంగా ఆర్యవైశ్య సభ ఆధ్వర్యములో దశమి సందర్భంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని శమి దర్శనం కొరకు స్థానిక శ్రీ బగ్గమల్లేశ్వర స్వామి దేవస్థానములో దాదాపుగా రెండు గంటల పాటు భక్తులకు దర్శనం ఇచ్చింది.

- Advertisement -

చాగలమర్రి గ్రామంలోని అమ్మవారిశాల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో భక్తులు దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు వంకధార లక్ష్మణ బాబు , ధర్మకర్త క్రిష్ణం శివ ప్రసాద్ , కమిటీ సభ్యులు , శ్రీ దేవీ శరన్నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు , శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడు జుటురు ఉదయ్ కుమార్ , కమిటీ సభ్యులు , అవొపా అధ్యక్షుడు సుంకు రాజేష్ , కమిటీ సభ్యులు , భక్తులు , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News