Monday, November 17, 2025
HomeదైవంDiwali 2025:ఈ ఏడాది దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి..20 నా..21 నా..!

Diwali 2025:ఈ ఏడాది దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి..20 నా..21 నా..!

Diwali Puja:భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. చిన్నా పెద్దా అందరూ ఉత్సాహంగా ఎదురుచూసే ఈ పండుగ ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరంగా ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. 2025లో ఈ పండుగ ఎప్పుడు జరగబోతోందనే అంశంపై భక్తుల్లో ఆసక్తి నెలకొంది. దృక్ పంచాంగం ప్రకారం 2025లో దీపావళి అక్టోబర్ 20న వస్తుంది.

- Advertisement -

ఆశ్వయుజ బహుళ అమావాస్య..

పంచాంగం ప్రకారం ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి అక్టోబర్ 20 తెల్లవారుజామున 3:44 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 21 ఉదయం 5:54 గంటలకు ముగుస్తుంది. అందువల్ల పండుగ ప్రధాన కార్యక్రమాలు అక్టోబర్ 20న జరపాలని నిర్ణయించారు. ఆ రోజు సోమవారం కావడంతో ఆధ్యాత్మికంగా మరింత శుభప్రదంగా భావిస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-effects-of-storing-items-under-the-bed/

ఇరువైపులా దీపాలు..

దీపావళి రోజు పూజ చేయడానికి ముందు ఇల్లు శుభ్రం చేయడం అత్యవసరమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఇంటి బయట ప్రవేశ ద్వారం వద్ద ముగ్గు వేసి, ఆ ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించడం ఆనవాయితీ. పూజా గదిలో ఎర్రటి వస్త్రం పరచి, దానిపై లక్ష్మీదేవి, గణేశుడు, కుబేరుడి విగ్రహాలు లేదా చిత్రాలను ప్రతిష్టించి పూజ ప్రారంభిస్తారు. ముందుగా నీరు ఆచమనం చేసి గణేశుడికి పూజ చేయాలి. ఆయనకు స్నానం చేయించి కొత్త వస్త్రాలు, పువ్వులు, దర్భ, చందనం సమర్పిస్తారు. అనంతరం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. అమ్మవారికి తామర పువ్వులు, సింధూరం, అక్షతలు, పసుపు, పండ్లు, స్వీట్లు, సుగంధ ద్రవ్యాలు సమర్పించడం ఆనవాయితీ.

ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన..

దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వస్తువులు కూడా పూజలో భాగం చేస్తారు. ఇది భవిష్యత్తులో వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తుందని నమ్మకం. పూజ సమయంలో ఎక్కువగా 11, 21 లేదా 51 దీపాలు వెలిగిస్తారు. చివరగా కుటుంబ సభ్యులందరూ కలిసి హారతి ఇచ్చి, ప్రసాదాన్ని పంచుకోవడం ఈ పండుగలో ముఖ్యాంశం.

తొమ్మిది నెయ్యి దీపాలను..

ఈ రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర తొమ్మిది నెయ్యి దీపాలను వెలిగించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. దీని వలన ఇంటి నుండి ప్రతికూల శక్తులు తొలగిపోతాయని, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. అదే విధంగా రాత్రి రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించి, వెనక్కి చూడకుండా ఇంటికి చేరడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగుతాయని ప్రజలు నమ్ముతారు.

తెలుపు లేదా పసుపు రంగు..

దీపావళి పూజ సమయంలో తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. కొత్త ఆర్థిక ప్రణాళికలను ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలమని కూడా భావన ఉంది. అప్పులు తీర్చుకోవడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి దీపావళి సమయాన్ని శుభకారకంగా పరిగణిస్తారు.

దీపావళి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఎంతో విశిష్టమైనది. వెలుగు చీకటిపై గెలిచిన రోజు అనే భావన ఈ పండుగకు ఆధారంగా ఉంది. సంపదకు అధిష్ఠాత్రి అయిన లక్ష్మీదేవి, జ్ఞానానికి ప్రతీక అయిన గణేశుడిని పూజించడం ద్వారా ఇంటికి సిరి, సంపద, శాంతి, ఆనందం వస్తుందని నమ్ముతారు. దీపాలు వెలిగించడం వలన చీకటిని తొలగించి సానుకూల శక్తులు ఆవహిస్తాయని భావన ఉంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-effects-of-keeping-henna-plant-at-home/

అలాగే దీపావళి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను కలిపే సందర్భం కూడా అవుతుంది. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, బహుమతులు పంచుకోవడం ద్వారా బంధాలను మరింత బలపరుస్తుంది. ఈ విధంగా దీపావళి ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్థిక పరంగా సమగ్రతను కలిగించే పండుగగా నిలుస్తుంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad