Pitru Paksha 2025 Grahan: హిందూ సాంప్రదాయంలో పితృ పక్షానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది పూర్వీకులను స్మరించుకోవడానికి మరియు గౌరవించడానికి అంకితం చేయబడిన పవిత్ర కాలం. మరణానంతరం పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగడానికి పిండం పెట్టడం, శ్రాద్ధకర్మలు చేయడం, తర్పణాలు వదలడం వంటివి చేస్తారు. దీంతో మీకు పూర్వీకుల ఆశీస్సుల లభిస్తాయి. అంతేకాకుండా మీ జీవితంలో శ్రేయస్సుతోపాటు ఆనందం వస్తుంది.
ఈ పక్షం రోజులు హిందువులు దానధర్మాలు చేస్తారు. ఈ ఏడాది రాబోయే పితృ పక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సమయంలో దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఖగోళంలో అరుదైన సంఘటన జరగబోతుంది. పితృ పక్షం సెప్టెంబర్ 7న చంద్రగ్రహణంతో ప్రారంభమై… సెప్టెంబర్ 21న సూర్యగ్రహణంతో ముగియనుంది.
పితృ పక్షం 2025 తేదీలు
ప్రారంభ తేదీ: 7 సెప్టెంబర్ 2025
ముగింపు తేదీ: 21 సెప్టెంబర్ 2025
చంద్రగ్రహణం 2025
సెప్టెంబర్ 7న చంద్రగ్రహణంతో పితృ పక్షం ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం, ఇది రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:26 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో చంద్రుడు రక్తం రంగులో కనిపిస్తాడు. అందుకే దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది.
సూర్యగ్రహణం 2025
పితృ పక్షం సెప్టెంబర్ 21న సంభవించబోయే సూర్యగ్రహణంతో ముగుస్తుంది. ఇది రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3:23 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం రాత్రి సమయంలో సంభవిస్తుంది కాబట్టి, ఇది భారతదేశంలో కనిపించదు.
Also Read: Vinayaka Chavithi 2025 – గణపతి మండపాలకు ఎందుకు బీమా చేస్తారో తెలుసా?
సూతక్ నియమాలు
భారతదేశంలో సూతక కాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమై.. గ్రహణం ముగిసే వరకు కొనసాగుతుంది. సూతక్ సమయంలో దేవాలయాలను సందర్శించవద్దు. ఆహారం వండటం లేదా తినడం చేయకూడదు. గర్భిణులు బయటకు వెళ్లకూడదు. ఒక శతాబ్దం తర్వాత జరిగే ఖగోళ కలయిక జరగబోతుంది కాబట్టి పితృ పక్షం పాటించేవారు సూతక నియమాలు జాగ్రత్తగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Onam 2025 – ఓనం పండుగ ఎప్పుడు? దీనిని ఎందుకు జరుపుకుంటారు?
Disclaimer: ఇక్కడ ఇచ్చిన కథనం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు. దీనిని పాటించేటప్పుడు నిపుణులను సంప్రదించండి.


