ప్రతి మనిషి జీవితంలో కలలు ఓ మిస్టరీ. ఇక ప్రతి కలకు ఓ అర్ధం ఉంటుందని పెద్దలు, పండితులు చెబుతుంటారు. ఇవి భవిష్యత్తులో ఎదురయ్యే మంచి చెడులకు సంకేతమని అంటున్నారు. అయితే వాటిని అర్థం చేసుకోవాలంటే స్వప్నశాస్త్రాన్ని ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే కొన్ని కలలు మన మనసు స్థితిని తెలియజేస్తే, మరికొన్ని భవిష్యత్తు గురించి సంకేతాలిచ్చే సూచికలుగా మారుతాయి. ముఖ్యంగా కలలో జంతువులు కనిపించడం… ఇది సాధారణమైన విషయం కాకపోవచ్చు. వాటి వెనుక ఓ దైవీ ప్రకంపనలు ఉన్నాయని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి.
పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. కలలో ఏనుగు కనిపిస్తే అది విజయం, ప్రతిష్ఠ, సంపదకి నోచుకునే సూచన అని పండితులు అంటున్నారు. ఇది ఆ వ్యక్తికి గజకేసరి యోగం ఏర్పడబోతుందని సూచనంట.. ఈ యోగం మనిషిని ఉన్నట్టుండి అభివృద్ధిపథంలో నడిపించగలదు. రాత్రికిరాత్రే ఆర్థికంగా ఎదగగల సామర్థ్యం ఇచ్చే శక్తి దీనికి ఉందని అంటున్నారు.
ఒకవేళ కలలో మీరు ఏనుగుపై కూర్చుని స్వారీ చేస్తున్నట్లుగా కనబడితే, అది మామూలు విషయం కాదంట.. అది జీవితంలో కొత్త శిఖరాలను అధిరోహించబోతున్నదీని సంకేతమని పండితులు అంటున్నారు. కెరీర్‌లో గొప్ప అవకాశాలు, గౌరవం, జనాదరణ, వంశపారంపర్య సంపద, మనోభావాలలో స్థిరత్వం.. ఇవన్నీ మీ జీవితంలోకి ప్రవేశించనున్నట్టు భావిస్తారు జ్యోతిష్య నిపుణులు.
అయితే, ఈ కలను ఒక శుభశకునంగా భావించి వెంటనే మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి ఏనుగు ఆకారంలోని విగ్రహాన్ని లేదా చిన్న విగ్రహాన్ని సమర్పిస్తే… అదృష్టం నిలకడగా ఉండే అవకాశముంది. ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాకుండా, మనం విశ్వాసంతో చేసిన చర్యలకు అనుకూల ఫలితాలు దొరుకుతాయని ప్రతీతి. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)