Sun Transit 2025 Effect On Zodiacs: సూర్యభగవానుడు నెలకొకసారి తన గమనాన్ని మార్చి రాశుల్లోకి సంచరిస్తూ ఉంటాడు. ఇలా సంవత్సరం మెుత్తం 12 రాశుల్లో ప్రయాణం చేస్తాడు. అలానే జూలై 16న కూడా ఆదిత్యుడు కర్కాటక రాశిలోకి వెళ్లబోతున్నాడు. విజయాన్ని ఇచ్చే సూర్యనారాయణుడు గ్రహ సంచారం కొందరికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. వీరు ఆర్థికంగా ఎదగడంతోపాటు ఉద్యోగ, వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. భాస్కరుడి అనుగ్రహం పొందబోతున్న ఆ రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం.
కన్య రాశి
కన్యారాశి వారికి సూర్యుడి కటాక్షంతో జూలైలో ఆదాయం విపరీతంగా పెరగబోతుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది. సంపద భారీగా వృద్ధి చెందుతుంది. మీ జీవితం ఆనందదాయకం అవుతోంది. ఇప్పటి వరుకు ఎదుర్కొన్న కష్టాలన్నీ మటుమాయం మవుతాయి. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. కెరీర్ కూడా మునుపటి కంటే అద్భుతంగా ఉంండబోతుంది.
మీనరాశి
భాస్కరుడు కృపతో మీనరాశి వారి ఊహించని ప్రయోజనాలను పొందబోతున్నారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. డబ్బు సమస్యలన్నీ దూరమవుతాయి. మీకు ఆదాయం పెరగడంతో ఆర్థికంగా స్థిరపడతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వృత్తి, ఉద్యోగంలో అద్భుత లాభాలు ఉంటాయి. అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి వస్తుంది.
వృషభ రాశి
గ్రహ రాజు సంచారం వృషభరాశి వారి జీవితంలో అనుహ్య మార్పులు తీసుకురానుంది. వీరు మంచి మనసు చేసే ఏ పనైనా సకాలంలో పూర్తవుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అదృష్టంతోపాటు ఊహించని ఐశ్వర్యం కూడా లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఆర్థికంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు. ఈ రాశి వారికి వివాహా యోగం ఉంది. పెళ్లైనా కొత్త దంపతులకు సంతానసుఖం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
సింహ రాశి
ఆదిత్యుడికి ఇష్టమైన రాశుల్లో సింహరాశి ఒకటి. వీరిపై సూర్యుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. జూలైలో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేస్తారు. కెరీర్ లో ఊహించని విధంగా మంచి మార్పులు చేసుకుంటాయి. ఉద్యోగాలు చేసేవారికి జీతభత్యాలు పెరడంతోపాటు పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఇంతకముందు కంటే బాగుంటారు. డైట్ ఫాలోయితే ఆరోగ్యంగా ఉంటారు.


