Sunday, November 16, 2025
HomeదైవంPositive Energy: ఇంట్లో వీటిని కానీ పెట్టారంటే..ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావు!

Positive Energy: ఇంట్లో వీటిని కానీ పెట్టారంటే..ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావు!

Feng Shui Tips To Attract Positive Energy:ఇంటిని అందంగా ఉంచుకోవడమే కాకుండా, ఆ ఇంట్లో సానుకూల శక్తి నిలవాలన్నదీ చాలామందికి ఉంటుంది. చైనీస్ పద్ధతిలో ప్రసిద్ధి చెందిన ఫెంగ్ షుయ్ సిద్ధాంతం ప్రకారం, ఇంట్లో కొన్ని ప్రత్యేక వస్తువులు ఉంచడం వల్ల పాజిటివ్‌ ఎనర్జీ అనేది పెరుగుతుందని, దాంతో జీవితం మరింత స్థిరంగా మారుతుందని చాలా మంది నమ్ముతుంటారు.

- Advertisement -

ఫెంగ్ షుయ్ సూత్రాలు మన ఇంట్లో ప్రతి దిశకు ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తాయి. ఈ సూత్రాల ప్రకారం సక్రమంగా వస్తువులు, మొక్కలు, లేదా చిత్రాలను ఉంచడం ద్వారా ఆర్థిక సమస్యలు తగ్గి, ఆనందం, విజయాలు పెరుగుతాయనే నమ్మకం ఎప్పుడూ ఉంటుంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/three-zodiac-signs-blessed-with-goddess-lakshmi-grace/

సూర్యోదయ దృశ్యాలు, పర్వతాలు, జలపాతాలు

ఇంట్లో సూర్యోదయ దృశ్యాలు, పర్వతాలు, జలపాతాలు లేదా పరుగెత్తుతున్న గుర్రాల చిత్రాలు ఉంచడం మంచి సూచనగా పండితులు,వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ చిత్రాలు ఉత్సాహాన్ని, కొత్త అవకాశాలను ఆకర్షిస్తాయని ఫెంగ్ షుయ్ నిపుణులు చెబుతారు. ముఖ్యంగా సూర్యోదయ దృశ్యం కొత్త ఆరంభానికి సంకేతమని, పర్వతాల చిత్రాలు స్థిరత్వాన్ని సూచిస్తాయని భావిస్తారు. ఈ చిత్రాలను హాల్ లేదా ప్రధాన గదిలో ఉంచితే కుటుంబంలో శాంతి, ఉత్సాహం పెరుగుతుందని పండితులు అంటున్నారు.

నవ్వుతున్న కుటుంబ సభ్యుల ఫోటో…

ఫెంగ్ షుయ్ సిద్ధాంతంలో నవ్వుతున్న కుటుంబ సభ్యుల ఫోటోలను నైరుతి దిశలో ఉంచడం మంచి ప్రభావాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఇది కుటుంబ సంబంధాలను బలపరుస్తుందని, సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని నమ్మకం. ఇంటిలో పాజిటివ్ వాతావరణం కొనసాగాలంటే అలాంటి ఫోటోలను సరైన దిశలో ఉంచడం ముఖ్యమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

వెదురు మొక్క, మనీ ప్లాంట్…

ఇంట్లో మొక్కలు కూడా ఫెంగ్ షుయ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ముఖ్యంగా వెదురు మొక్క, మనీ ప్లాంట్ ఎక్కువ ప్రాధాన్యం కలిగినవి. వెదురు మొక్కను ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచితే అదృష్టం, శ్రేయస్సు పెరుగుతుందని ఫెంగ్ షుయ్ సూత్రాలు చెబుతున్నాయి. కుటుంబం కలసి గడిపే ప్రదేశంలో వెదురు మొక్కను ఉంచితే సానుకూల శక్తి స్థిరపడుతుంది.

మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశ…

అదే విధంగా మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో పెంచడం ఆర్థికంగా మంచిదని ఫెంగ్ షుయ్ సూచిస్తుంది. ఇది ధనప్రవాహాన్ని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుందని, అనవసర ఖర్చులను తగ్గిస్తుందని విశ్వాసం. ఆగ్నేయ దిశను సంపదకు సంబంధించిన కోణంగా చెబుతుంటారు.

తాబేలు విగ్రహాన్ని...

డబ్బు సమస్యల నుంచి ఉపశమనం పొందాలనుకునేవారు ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచవచ్చు. ఫెంగ్ షుయ్ ప్రకారం తాబేలు శాంతి, దీర్ఘాయువు, సంపదకు చిహ్నంగా పండితులు వివరిస్తుంటారు. ఉత్తర దిశలో తాబేలు విగ్రహం ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని, ఉద్యోగం లేదా వ్యాపారంలో ముందడుగు వేయడానికి సహాయపడుతుందని చెబుతారు.

నీటి ప్రవాహం..

ఇంట్లో నీటి ప్రవాహం ప్రతీకలు కూడా ఫెంగ్ షుయ్‌లో శుభంగా భావిస్తారు. చిన్న ఫౌంటెన్ లేదా అక్వేరియం ఉంచడం ద్వారా ఇంట్లో శాంతి, ఉత్సాహం పెరుగుతాయని నమ్ముతారు. వీటిని ఉంచడానికి ఉత్తరం లేదా ఈశాన్య దిశ ఉత్తమంగా చెప్పుకోవచ్చు. నీటి శబ్దం సానుకూల శక్తిని పెంచుతుందని, మానసిక ప్రశాంతతను ఇస్తుందని కూడా పండితులు వివరిస్తారు.

విండ్ చైమ్స్ …

ఇంటి ప్రధాన ద్వారం లేదా కిటికీల దగ్గర విండ్ చైమ్స్ ఉంచడం కూడా ఫెంగ్ షుయ్‌లో ముఖ్యమైన పద్ధతి. విండ్ చైమ్స్ శబ్దం గాలి తాకిడితో సృష్టించే మధురమైన ధ్వని ఇంటి లోపలి వాతావరణాన్ని శుభప్రదంగా మారుస్తుందని నమ్ముతారు. ప్రతికూల శక్తిని తగ్గించి సానుకూలతను ఆకర్షించే సాధనంగా దీనిని పరిగణిస్తారు. ప్రత్యేకించి మెటల్ లేదా బాంబూ విండ్ చైమ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి.

Also Read:https://teluguprabha.net/devotional-news/lucky-zodiac-signs-in-karthika-masam/

ఇంట్లో ప్రతి మూల ప్రదేశానికి ఒక శక్తి ప్రాముఖ్యత ఉందని ఫెంగ్ షుయ్ చెబుతుంది. కాబట్టి ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవడం ముఖ్యం. ఫెంగ్ షుయ్ సూత్రాలు కేవలం అలంకరణ కోసం కాకుండా, మన ఆలోచనలకు, మనసుకు సమతుల్యతను తీసుకురావడానికీ ఉపయోగపడతాయి.

ప్రతికూల శక్తి …

ప్రతి ఇంటిలో శక్తి ప్రవాహం సరిగా ఉండాలంటే క్రమం తప్పకుండా ఇంటిని శుభ్రంగా ఉంచడం, అనవసర వస్తువులను తొలగించడం కూడా అవసరం. అవి నిల్వలో ఉండడం వల్ల ప్రతికూల శక్తి పెరగవచ్చని ఫెంగ్ షుయ్ సిద్ధాంతం చెబుతుంది. సానుకూల శక్తి ప్రవాహం ఉండేలా ఇంట్లోని వస్తువులను సక్రమంగా అమర్చడం కూడా భాగమని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad