ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు. గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో వెలసిన శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం నూతన ధ్వజస్తంభ పునః ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వేద పండితులు వేద పారాయణం యాగశాలలో ప్రాణ ప్రతిష్ట హోమములు విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య లక్ష్మి దంపతులు ధ్వజస్తంభానికి నవధాన్యాలు నవరత్నాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు మహాశక్తివంతమైన ముహూర్తంలో యాగశాలలో యంత్ర ప్రతిష్ట మహా పూర్ణాహుతి నిర్వహించారు.
మంగళ వాయిద్యాల నడుమ వేదమంత్రాలతో యంత్రాలను ప్రతిష్టించి భారీ క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని ప్రాణ ప్రతిష్టగావించారు. భక్తులు నవధాన్యాలు పసుపు కుంకుమ సమర్పించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజ లు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి విశేష పుష్ప అలంకరణ సేవ నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆలయ కార్యనిర్వాక అధికారి సమత రైల్వే మాజీ ఉన్నతాధికారి భూక్య కస్నా నాయక్ కందునూరి ఉపేందర్ పరుచూరి కుటుంబరావు శ్రీనివాస్ గుప్తా కనక శేఖరం టీటీడీ ధర్మ ప్రచార కమిటీ సభ్యులు రాముల నాయక్ గంగావత్ లక్ష్మణ్ నాయక్ అజ్మీరా బన్సీలాల్ పుల్ల ఖండం రమేష్ బాబు పుల్ల ఖండం వేణుగోపాల్ జాటోత్ ఝాన్సీ లక్ష్మి మల్లం నరేందర్ పరి కిషన్ పులి గోపాల్ రెడ్డి ప్రమీల రెడ్డి బానోత్ అర్జున అమర్చంద్ ఆలయ అర్చకులు రాముస్వామి అచ్చుత్ స్వామి భక్తులు పాల్గొన్నారు.