Monday, July 8, 2024
HomeదైవంGarla: కంఠమహేశ్వరుడికి బోనాలు

Garla: కంఠమహేశ్వరుడికి బోనాలు

మొక్కులు చెల్లించుకున్న గౌడ కులస్తులు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గౌడ కులస్తులు తమ ఆరాధ్య దైవంగా పూజలందుకునే సురమాంబ సమేత కంఠ మహేశ్వర స్వామికి గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల మహోత్సవం కన్నుల పండుగ జరుపుకున్నారు. ప్రతి ఇంటి నుండి ఆడపడుచులు బోనం తయారు చేసి నెత్తిన బోనాలను పెట్టుకొని డప్పు వాయిద్యాలు నడుమ గార్ల పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తూ శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని వన మైసమ్మ ఏడుతాల్ల ఎల్లమ్మ ముత్యాలమ్మ దేవత మూర్తులను పూజించి అభిషేకాలు నిర్వహించారు.

- Advertisement -

తమతో పాటు తీసుకొచ్చిన నైవేద్య ప్రసాదాలను స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సురమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో కందునూరి శ్రీనివాస్ సుజాత తోడేటి శ్రీనివాస్ ఉమా దంపతులు పీఠాలపై కూర్చొని వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విజయ రాముడు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ కత్తి సత్యం మండ రవి బూర్ణ రాము మహేష్ కత్తి సురేష్ ఈశ్వర్ లింగం తోడేటి కోటేష్ కత్తి రాజేష్ మండ రంజిత్ తోడేటి సత్యం నాగరాజు కత్తి వెంకన్న మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News