Sunday, October 13, 2024
HomeదైవంGarla: కల్యాణ మహోత్సవానికి బయలు దేరిన స్వామివారు

Garla: కల్యాణ మహోత్సవానికి బయలు దేరిన స్వామివారు

గోవిందనామ స్మరణ మధ్య...

గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో జరిగే బ్రహ్మోత్సవాలో భాగంగా ఆదివారం స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో మేళతాలాల నడుమ అర్చకుల వేదమంత్రాలతో స్వామివారిని ప్రత్యేకమైన పట్టు వస్త్రాలతో పెళ్ళికొడుకుగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారి ఉత్సవ విగ్రహలను అలంకరించిన పూల రథంపై వేయింపచేసి ఆలయం నుండి పట్టణ పురవీధుల గుండా భక్తి శ్రద్ధలతో గోవింద నామ సంకీర్తనలతో ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తూ కళ్యాణ మహోత్సవానికి మర్రిగూడెం దేవస్థానానికి సాగనంపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధికారిని సమత మాజీ సర్పంచ్ అజ్మీర బన్సిలాల్ మల్లం నరేందర్ రాములు నాయక్ పరుచూరి కుటుంబరావు వేమిశెట్టి శ్రీనివాస్ గుప్తా రమేష్ బాబు ఉపేందర్ అర్చకులు ప్రవీణ్ అచ్చుతాచార్య వెంకటస్వామి మహిళలు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News