Thursday, October 17, 2024
HomeదైవంGarla: కన్నుల పండువగా వేట వెంకన్న కల్యాణం

Garla: కన్నుల పండువగా వేట వెంకన్న కల్యాణం

కల్యాణం, కమనీయం..

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గార్ల మండల పరిధిలోని స్థానిక మర్రిగూడెం వేట వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గురువారం శ్రీదేవి భూదేవి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసంలో 7 రోజులపాటు శ్రీ వేట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

- Advertisement -

సర్వాలంకృతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి సమేత శ్రీదేవి భూదేవి గోదాదేవి ఉత్సవ విగ్రహాలను పూల మాలలతో అలంకరించిన ప్రత్యేక పల్లకిలో ప్రతిష్టించి మేల తాళాలతో ఊరేగిస్తూ ఎదుర్కోళ్లు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహిం చారు. స్వామివారి కళ్యాణం తలంబ్రాలు డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామ వాస్తవ్యులు మల్లెం వంశస్థులు వెంకట నారాయణ కమల మల్లం పరీకిషన్ నరేందర్ పద్మ దంపతులు తీసుకురాగా నవీన్ కుమార్ వాసవి సతీష్ కుమార్ చందన కాండూరి రామాంజచార్యులు కాండూరి లక్ష్మీనారాయణ లక్ష్మి కాండూరి శేషాచార్యులు వాణి రంగనాథ స్వామి హేమలత ఉమా శంకర్ సుచిత్ర పుల్లఖండంవేణుగోపాల్ కవిత బూడిద అరుణ్ గౌడ్ రాణి దంపతులు పీటలపై కూర్చోగా, కళ్యాణ తంతును అర్చకులు రామాయణం గోవిందస్వామి అచ్చుతాచార్యులు కండ్లకుంట్ల వెంకటాచార్యులు నంద కుమార్ కాండూరి లక్ష్మీనారాయణ చార్యులు రామాయణం శ్రీధర్ స్వామి రామాయణం రమేష్ స్వామి వేద మంత్రోచ్చారణల నడుమ ఆగమ శాస్త్రం ప్రకారం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మండపం ప్రాంగణం మొత్తం భక్త జనంతో కిటకిటలాడింది. గోవింద నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మొత్తం మార్మోగింది. కన్నుల పండుగ జరిగిన కళ్యాణ మహోత్సవానికి ఖమ్మం హైదరాబాద్ నల్లగొండ సూర్యాపేట మహబూబాబాద్ కోదాడ జిల్లాల నుండి వచ్చిన భక్తులు కళ్యాణ తంతును తిలకించి భక్తిపారవశ్యంతో మునిగితేలారు కళ్యాణంసందర్భంగా ఎస్సై జీనత్ కుమార్ పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరుచూరి కుటుంబరావు కనకలక్ష్మి దంపతులు 1,50,000 విలువ గల బంగారు హారాన్ని మూల విరాట్ కి సమర్పించి కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేశారు.

ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి సమత ఝాన్సీ లక్ష్మి అజ్మీరా బన్సీలాల్ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి భూక్య కస్నానాయక్ పుల్ల ఖండం రమేష్ బాబు శ్రీనివాస్ గుప్తా కనక శేఖరం మళ్లీ బాబు హరి టీటీడీ ధర్మ ప్రచార కమిటీ సభ్యులు రాములు నాయక్ జితేందర్ అగర్వాల్ పుర ప్రముఖులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News