Saturday, October 5, 2024
HomeదైవంGarl: అయోధ్య కోటి అక్షతలు అట్టహాసంగా శోభాయాత్ర

Garl: అయోధ్య కోటి అక్షతలు అట్టహాసంగా శోభాయాత్ర

రామ నామస్మరణతో మార్మోగిన పురవీధులు

శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం నుంచి వచ్చిన అక్షిత కలశాలతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. తొలుత గార్ల మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో అక్షిత కలశాలకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం నుండి డప్పు చప్పుళ్ల కోలాటాల నడుమ అక్షిత కలశాలను తలపై ఎత్తుకొని కాషాయ జండాలతో జై శ్రీరామ్ అంటూ నినాదాలతో భజన సంకీర్తనలతో గార్ల పట్టణ పురవీధుల గుండా భక్తజనం అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించారు.

- Advertisement -

మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి అక్షత కలశాలకు పూజలు చేశారు. దీంతో పట్టణ పరిసరాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి ఒక్కరిలోనూ భక్తి భావం పెల్లుబికింది. ఈ శోభయాత్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వహిందూ పరిషత్ జిల్లా కమిటీ సభ్యులు పోరిక కృష్ణమోహన్ మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం రామచంద్రుని 800 సంవత్సరాల కల నేటికి తీరిందని ఈ పవిత్రమైన అక్షింతలను జనవరి 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు పట్టణ పరిసర ప్రాంతం గ్రామాలలో ప్రతి ఇంటికి అయోధ్య నుంచి వచ్చిన అక్షతలను పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని 22వ తేదీ ప్రాణ ప్రతిష్ట రోజున ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి భక్తిని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ జడ్పిటిసి ఝాన్సీ లక్ష్మి ఇల్లందు మాజీ ఏఎంసి భూక్య నాగేశ్వరరావు పిఎసిఎస్ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ గౌడ్ బిజెపి రాష్ట్ర నాయకులు విమల్ కుమార్ జైన్ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు జస్వంత్ ప్రసాద్ బిజెపి పార్టీ నాయకులు అజ్మీర రాము దేవా బుచ్చిబాబు మనోజ్ అగర్వాల్ కాల విశాల్ జైన్ కమల్ అగర్వాల్ కట్ట రమేష్ జక్కుల పాండురంగారావు రమేష్ బాబు వేమి శెట్టి శ్రీనివాస్ రంగారావు పోతుల నరసింహారావు శ్రీనివాస్ గుప్తా కనక శేఖరం అత్తులూరి సత్యం ఆలయ అర్చకులు కాండూరి లక్ష్మి నారాయణ చార్యులు అయ్యప్ప దీక్ష స్వాములు కొండల్ మణి అరుణ్ జయశంకర్ మండ శ్రీను పట్టణ పుర ప్రముఖులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News