Sunday, July 7, 2024
HomeదైవంMahanandi: మహానందిలో కంచి కామకోటి పీఠాధిపతి ప్రత్యేక పూజలు

Mahanandi: మహానందిలో కంచి కామకోటి పీఠాధిపతి ప్రత్యేక పూజలు

లోక కల్యాణార్థం..

మహానంది క్షేత్రంలో లోకకళ్యాణార్థం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని, ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగద్గురు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు లోక కళ్యాణార్థం జరుపుతున్న విజయ యాత్రలో భాగంగా ఈనెల 25, 26 తేదీలలో కంచి కామకోటి పీఠ పూజలను నిర్వహిస్తామన్నారు.

- Advertisement -

శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివార్లకు విశేష పూజలు నిర్వహిస్తారని అన్నారు. శ్రీశైలం శైవ క్షేత్రంలో ఉన్న పీఠాధిపతిని స్వయంగా కలిసి పలు అంశాలపై ఆయనతో చర్చించామని, మహానంది క్షేత్రంలో రెండు రోజులపాటు ఉంటారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News