Sunday, September 22, 2024
HomeదైవంJadcharla: ఘనంగా మద్దులమ్మ దేవి బోనాలు

Jadcharla: ఘనంగా మద్దులమ్మ దేవి బోనాలు

బోనాల వేడుకలలో..

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మ పేట శ్రీ మద్దులమ్మ (కాత్యాయిని) దేవి బోనాలను జడ్చర్ల, కావేరమ్మ పేట భక్త మార్కండేయ పద్మశాలి కులస్తులు ఘనంగా నిర్వహించారు. కావేరమ్మ పేట 44వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న శ్రీ మద్దులమ్మ దేవి బోనాల పండుగను శ్రీ భక్త మార్కండేయ స్వామి పద్మశాలి సంఘం అధ్యక్షులు పున్న కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పద్మశాలి కులస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా పద్మశాలీలు మద్దులమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించారు. పద్మశాలీలు నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. బోనాల వేడుకలలో సంఘ సభ్యులు పర్వతాలు, చంద్రశేఖర్, ఒగ్గు శ్రీధర్, జంగయ్య, పవన్, శేఖర్, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News