ముక్కోటి ఏకాదశికి జడ్చర్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు పలు దేవాలయాలు ముస్తాబయ్యాయి. జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 3 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ మాడవీధుల గుండా స్వామి వారి దివ్య భవ్య పల్లకి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు గురువారం దేవాలయ ధర్మకర్త నరహరి బీంసేనా చార్యులు తెలిపారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సర్వాలంకార శోభితుడైన శ్రీవారిని శుక్రవారం ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉత్తర ద్వారా దర్శనంతో స్వామివారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు.